Prabhas: ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ మైథలాజికల్ మూవీ “ఆది పురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆది పురుష్ కి అజయ్ – అతుల్ సంగీత ద్వయం మ్యూజిక్ అందించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, అలాగే దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా గా నటించడం జరిగింది. రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక తాజాగా విడుదలైన ఆదిపురుష్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని భారీగా పెంచేసింది.

అంతకు మందు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్ విజువల్స్ అంతగా ఆకట్టుకోకపోవడం తో మూవీ టీమ్, మళ్ళీ రీషూట్ చేయడమే కాక, గ్రాఫిక్స్ పైనా బాగా శ్రద్ధ పెట్టడంతో సినిమా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇక “ఆది పురుష్” జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుందని తెలిసిందే. అందువల్ల చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఆది పురుష్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అలాగే ఈవెంట్ వేదిక స్థలాన్ని ఖరారు చేసారు.

ఆది పురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6 న తిరుపతిలో గ్రాండ్ గా జరుపనున్నామని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియచేసారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్, నటీ నటులు మాత్రమే గాక, టాలీవుడ్ నుండి ప్రముఖులు అతిధులుగా హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్న మూవీ టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మరెంత హైప్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు