Madhuri Dixit : ఆ సమస్యలు నాకు తెలుసు

బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మాధురి దీక్షిత్ కి వయసుతోపాటు గ్లామర్ కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా, డాన్స్ క్వీన్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మాధురి దీక్షిత్.. తాజాగా మరోసారి డిజిటల్ వేదికపై సినీ ప్రియలను అలరించేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న డిజిటల్ ప్రాజెక్ట్ ” మాజా మా”. ఆనంద్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోరిత్విక్ భౌమిక్, సృష్టి శ్రీవాస్తవ, గజరాజ్ రావ్, బర్ఖాసింగ్, రజిత కపూర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ మిడిల్ క్లాస్ మదర్ గా.. ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాధురి దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. “భారతీయ సంస్కృతి చాలా గొప్పది. నాకు పండుగలు అంటే ఇష్టం. అందులో దీపావళి అంటే మరింత ఇష్టం. దీపావళి రోజు నేనే స్వయంగా మిఠాయిలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాను. ప్రతి వేడుకకు కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరడం నిజంగా గొప్ప విషయం. కలసి భోజనం చేయడం వల్ల బంధాలు, బంధుత్వాలు బలపడతాయి.

నేను హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా బాధగా అనిపించేది. కానీ వృత్తికి న్యాయం చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. ” మజా మా” సినిమాలో నేను ఇద్దరు పిల్లల తల్లి పాత్ర లో నటించాను. ఒక స్త్రీ ఇంట్లో ఇల్లాలిగా, తల్లిగా ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. ప్రతి పాత్రలో లీనమైతేనే ఆ పాత్రకి న్యాయం చేయగలమని నమ్ముతాను. ప్రతి పనిలోనూ ఓ సమస్య తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని అధిగమించి మనం చేస్తున్న పనిని ఇష్టపడి చేయాలి”. అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు