Like, Share & Subscribe : డబ్బుల్ వాపస్

ప్ర‌స్తుతం రోజు రోజుకు టెక్నాల‌జీ పెరుగుతుండ‌డంతో రొటిన్ క‌థ‌లు ప్రేక్ష‌కుల‌కు బోరుకొడుతున్నాయి. ఏదైనా కొత్త‌ద‌నం ఉంటేనే స‌గ‌టు ప్రేక్ష‌కుడు థియేట‌ర్ వైపు ప‌రుగెడుతున్నాడు. లేదంటే క‌నీసం థియేట‌ర్ వైపు కూడా వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ త‌రుణంలోనే సోష‌ల్ నేప‌థ్యంలో ‘లైక్ షేర్ అండ్ స‌బ్ స్క్రైబ్’ అనే చిత్రం రాబోతుంది.

సంతోష్ శోభ‌న్‌, ఫిరియా అబ్దుల్లా జంట‌గా న‌టిస్తున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. ఆముక్త క్రియేష‌న్స్, నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రొమాన్స్, స‌స్పెన్స్‌తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. న‌వంబ‌ర్ 4న ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది అని చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌క‌టించింది. విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో నిర్వ‌హించిన స‌మావేశంలో బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు.

ప్ర‌ధానంగా లైక్ షేర్ అండ్ స‌బ్ స్క్రైబ్ సినిమా ఫుల్ కామెడీ ఉంద‌న్నారు. ఈ చిత్రం చూసి క‌నీసం 15 సార్లు అయినా న‌వ్వ‌క‌పోతే డ‌బ్బులు వాప‌స్ ఇస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇది విన్న ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఎలాగైనా ఒక‌సారి చూడాలి అని మాట్లాడుకోవ‌డం విశేషం. సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం న‌వంబ‌ర్ 4 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు