LGM: ధోని వైఫ్ సాక్షి ఆ స్టార్ హీరోకి పెద్ద ఫ్యాన్…!

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మెహేంద్ర సింగ్ ధోని ఇటీవలే ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే తమిళ సినిమా ద్వారా సినిమా ద్వారా ధోని సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేశారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, యోగిబాబు, నదియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 28న విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని ముమ్మరం. తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సాక్షి ధోని మీడయా సమావేశంలో పాల్గొంది. ఈ ప్రెస్ మీట్లో సాక్షి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

మీరు తెలుగు సినిమాలు చూశారా అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను చాలా తెలుగు సినిమాలు చూశానని, ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన సినిమాలన్నీ చూశానని చెప్పింది. బన్నీకి తాను పెద్ద ఫ్యాన్ అని ఓటీటీలు రాని రోజుల్లో బన్నీ సినిమాలన్నీ యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయ్యేవని ఆ సినిమాలన్నీ చూశానని చెప్పుకొచ్చింది.

సాక్షి అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. ఇంట్రస్టింగ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. దీనికి తోడు ఇప్పుడు సాక్షి అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న పాజిటివ్ పాయింట్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు