Namitha: ఆ స్టార్ హీరో తో నమిత ఎ ఫైర్.. అవమానించిన దర్శకుడు ?

హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నమిత ఇప్పుడు ఈ హీరోయిన్ కనుమరుగు అయిపోయి ఉండొచ్చు కానీ ఒకప్పుడు మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది. నమిత తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటిమని అసలు పేరు నమిత వాంక్వాలా. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. 1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది. సొంతం చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత జెమిని, ఒక రాజు ఒక రాణి, ఒక రాదా ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఆ తర్వాత తమిళ, కన్నడ, హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది. ఇది ఇలా ఉండగా, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మొదటి అవకాశాన్ని అందుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది నమిత. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ చిత్రం హీరో ఆర్యన్ రాజేష్, నమిత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టడంతో డైరెక్టర్ శ్రీనువైట్లకి బాగా కోపం వచ్చింది.

అయితే ఒకసారి ఫారిన్ షూటింగ్ లో నమిత, రాజేష్ చాలా క్లోజ్ గా ఉండడం చూసి విపరీతంగా ఫైర్ అయ్యారట శీనువైట్ల. అంతేకాదు అందరి ముందే ఆమెను తిడుతూ అవమానించారట. దీంతో కృంగిపోయిన నమిత ఇకపై శ్రీనువైట్లతో నటించే ప్రసక్తే లేదని డిసైడ్ అయ్యిందని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు