NBK 107 : టైటిల్ పోస్ట‌ర్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఇటీవ‌లే అఖండ మూవీతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అఖండ విజ‌యం త‌రువాత వ‌రుస సినిమాలు చేసేందుకు లైన్‌లో పెట్టాడు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖ‌రారు కాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర్కింగ్ టైటిల్ NBK 107 పేరుతో తెర‌కెక్కుతుంది.

ఈ చిత్రంలో శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. షూటింగ్ కూడా శ‌ర‌వేగంగానే జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి వ‌రుస అప్‌డేట్ల‌ను అందిస్తోంది చిత్ర యూనిట్‌. మైత్రి మూవీస్ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా చిత్రంపై నంద‌మూరి అభిమానులు భారీ అంచ‌నాలు వేసుకుంటున్నారు. గోపిచంద్ మ‌లినేని ర‌వితేజ హీరోగా క్రాక్ సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో బాల‌య్య సినిమా కూడా మాస్ ఆడియ‌న్స్‌కి న‌చ్చేలాగా ఉంటుంద‌ని టాక్‌.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ వ‌దిలారు. ఈ సినిమా టైటిట్ లోగో రిలీజ్ చేస్తూ.. టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అక్టోబ‌ర్ 21న రాత్రి 8.15 గంట‌ల‌కు ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఒక పోస్ట‌ర్ ద్వారా తాజాగా చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ కార్య‌క్ర‌మం క‌ర్నూల్ కొడారెడ్డి బురుజు వ‌ద్ద లాంచ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి టైటిల్ లోగో లాంచ్ కూడా కొత్త‌గా ట్రై చేస్తున్నార‌నే చెప్పాలి. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో ఇందులో బాల‌య్య ఫేస్ క‌నిపించ‌కుండా పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తి రేపుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు