బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నుండి తాజా గా వస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కాబోతుంది. ‘ఫారెస్ట్ గంప్’ అనే అమెరికన్ మూవీ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆమీర్ ఖాన్ ఈ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ పోషించాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య కూడా ఓ స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నాడు. అయితే ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ లో నాగ చైతన్య ఎక్కువగా కనిపించలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై అసంతృప్తి గురి అయ్యారు.
నిజానికి లాల్ సింగ్ చద్దా హిందీ వెర్షన్ లో నాగ చైతన్య రోల్ తక్కువగానే కనిపిస్తుందట. కానీ, తెలుగు వెర్షన్ లో మాత్రం చైతన్య సన్నివేశాలను కొంచెం పెంచినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమాలో చైతన్య 15 నుండి 20 నిమిషాలు మాత్రమే అని వినికిడి.
ఇలా చేయడం వల్ల, తెలుగులో కూడా ‘లాల్ సింగ్ చద్దా’ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కలెక్షన్లు కూడా రావచ్చు. ఇదే ‘లాల్ సింగ్ చద్దా’ మేకర్స్ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్’, ‘వయాకామ్ 18 స్టూడియోస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.