Tees Maar Khan : ఆసక్తికరంగా రెండో టీజర్

విలక్షణ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది తాజా గా తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మింస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి. తాజా గా చిత్ర బృందం రెండో టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో ఆదిని మరింత పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు. సూపర్ పోలీస్ గా కనిపిస్తున్న ఆది, డైలాగ్ లు కూడా ఆసక్తి కరంగా ఉన్నాయి.

’అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క పది నిమిషాలు. చంపను అన్నా, జస్ట్ కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లిపోతా‘ అలాగే, ’థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ, నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్‘ డైలాగ్స్ ఆది పాత్ర గురించి వివరించేలా ఉన్నాయి. మొదటి టీజర్ లాగే, ఈ టీజర్ లో కొంత వరకు మసాలా ను చేర్చారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఆదికి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తీస్ మార్ ఖాన్ టీజర్ పర్వాలేదని అనిపిస్తుంది. అయితే, సినిమాపై హైప్ రావడానికి ఇది సరిపోదు. సినిమా నిండా, యాక్షన్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ఉండాలి. అది కూడా ఆసక్తికంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్స్ వస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 19 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు