RamaRao On Duty : ట్రైలర్ రిలీజ్ లాక్ !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ హీరో రవితేజ. ఎప్పుడు మాస్ సినిమాలు చేసే రవితేజ, ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతోనే శరత్ మండవ దర్శకుడుగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్, ఎస్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక మాస్ మహారాజ్ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అటు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు , పోస్టర్లు టాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ విడుదల టైం ఫిక్స్ అయింది. ఇవాళ సాయంత్రం 8:01 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు రవితేజ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రవితేజ ఫుల్ క్లాసు గా ఉన్నాడు. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఈనెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు