Krithi Shetty: అచ్చ తెలుగులో మాట్లాడి అదరగొట్టిన బేబమ్మ

నాగ చైతన్య హీరోగా నటించిన తెలుగు, తమిళ్ బై లాంగ్వేజికల్ సినిమా కస్టడీ ఈనెల 12న విడుదలకి సిద్ధమవుతోంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో చై తమిళ్ లో హీరోగా లాంచ్ అవుతున్నాడు. చై కి జోడిగా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం రోజున హైదరాబాద్ లో నిర్వహించారు. అక్కినేని అభిమానుల మధ్య సందడిగా జరిగిన ఈ ఈవెంట్ లో కృతి శెట్టి స్పీచ్ అందరిని ఆకట్టుకుంది.

ఉప్పెన సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగు ఫిలిం ఇండస్టీలో ఏళ్ళ తరబడి స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా తెలుగులో స్పష్టంగా మాట్లాడరు, కానీ కృతి మాత్రం వాళ్ళతో పోల్చి చూస్తే, తక్కువ సినిమాలే చేసిన కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.

నిన్న (ఆదివారం) జరిగిన కస్టడీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కృతి స్పష్టమైన తెలుగులో స్పీచ్ ఇచ్చింది. అంతేకాదు సినిమాకి పని చేసిన ప్రతి మెయిన్ టెక్నీషియన్ ని అడ్రెస్ చేస్తూ, అందరి గురించి మాట్లాడింది. ఒక పక్క ఫ్యాన్స్ అందరు చై గురించి మాట్లాడు.. అంటూ కంగారు పెట్టిన కూడా కృతి, చై గురించి మాట్లాడుతూనే టెక్నీషియన్స్ ని కూడా గౌరవించింది. “ట్రైలర్ నచ్చిన మీ అందరికి సినిమా కూడా తప్పకుండ నచ్చుతుంది. అందరు థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అంటూ తన స్పీచ్ ని ముగించింది.

- Advertisement -

ప్రస్తుతం కృతికి తెలుగులో సినిమాలేవీ లేకపోవడంతో, మలయాళంలో తన డెబ్యూ ఇవ్వడానికి రెడీ అయింది. మిన్నల్ మురళి ఫెమ్ టోవినో థామస్ హీరోగా రాబోతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు