Athulya Ravi: ఛాన్సుల కోసం గ్లామర్ షో చేస్తున్న మీటర్ హీరోయిన్

కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ అతుల్య రవి. చెన్నై కి చెందిన ఈ బ్యూటీ మొదట తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2017లో “కాదల్ కన్ కట్టుందే” మూవీతో హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తరువాత వరుస బెట్టి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. వట్టామ్, యెన్ని తునిగా, కడవర్ సినిమాలు చేసింది. అయితే ఇవేమి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత రేంజ్ లో ఆడలేదు.

అయితే 2023 లో తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆఫర్ వచ్చింది. రమేష్ కదురి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా అతుల్య రవి చేసింది. తెలుగులో ఇదే ఈమెకి ఫస్ట్ మూవీ కాబట్టి భాష కూడా బాగా నేర్చుకుని ప్రమోషన్లలో పాల్గొంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్లు పూర్తిగా కరువయ్యాయి.

ప్రస్తుతం డీజిల్ అనే ఒక్క తమిళ సినిమా తప్ప చేతిలో ఇంకే మూవీ లేదు. ఇది కూడా 2022 లో స్టార్ట్ అయిన మూవీ. అందుకే అతుల్య రవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. సెలబ్రిటీల బర్త్ డే లకు విష్ చేస్తూ, ఫ్యాన్స్ తోను చాట్ చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ ఫోటోషూట్ లతో గ్లామర్ షోస్ చేస్తూ కనిపిస్తుంది. ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో టాప్ హీరోయిన్లను ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తుంది. కనీసం ఇలా చేస్తే అయినా మూవీ ఆఫర్లు వస్తాయని భావిస్తుంది. అయినా ఇండస్ట్రీ లో అందం, టాలెంట్ రెండు ఉన్నా నిలదొక్కుకోవాలంటే హిట్లు, అదృష్టం కూడా కలిసిరావాలి. లేదంటే ఎన్ని గ్లామర్ షోలు చేసినా వేస్టే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు