Kollywood: వామ్మో.. నయనతార ఆ మంత్రితో కూడా ఎఫైర్ నడిపించిందా..?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే నయనతార కెరీర్ పరంగా ఎంత పాపులర్ అయిందో తన పర్సనల్ లైఫ్ విషయం కూడా ఎప్పటికప్పుడు అంతే హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. అయితే నయనతార గురించి అభిమానులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.

కెరీర్ లో ఎఫైర్స్ విషయంలో ఎలా ఉన్నా.. వ్యక్తిత్వం పరంగా నయనతార ఎంతో మంచి మనిషి అని కోలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇక నయనతార ప్రేమాయణాల గురించి తెలిసిందే. ఈమె కెరీర్ లో లవ్, బ్రేకప్స్ అనేవి కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో వింటున్న వార్తలే. చిన్నపిల్లాడిని అడిగినా నయనతార లవ్ ఎఫైర్స్ గురించి టక్ మని చెబుతాడు. కెరీర్ ప్రారంభంలో నయనతార తమిళ అమ్మాయిల కలల రాకుమారుడు శింబు తో లవ్ ఎఫైర్ నడిపించింది. ఇక తమిళ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వార్త నయన్ – శింబుల లిప్ లాక్ ఫోటో. వీరిద్దరూ దాదాపు నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. వీరు సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు లీక్ అయ్యి ప్రకంపనలు సృష్టించాయి. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరు విడిపోయారు.

ఇక తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపించింది. ప్రభుదేవా కి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతనితో పెళ్లికి సిద్ధం అయింది నయనతార. కానీ చివరికి ఏం జరిగిందో కానీ నయన్ ప్రభుదేవా బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక చివరికి నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోవడంతో పాటు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నయనతార కి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈమె తమిళనాడు ఎమ్మెల్యే, హీరో ఉదయనిది స్టాలిన్ తో కూడా ఎఫైర్ నడిపించిందట. ఈ విషయాన్ని తాజాగా నటుడు, బిజెపి నేత ధారారవి వెల్లడించారు. నయనతార తో మంత్రి ఉదయనిది కి ఎఫైర్ ఉందని.. ఈ విషయాన్ని తాను మాట్లాడినందుకే డిఎంకె పార్టీ నుండి బహిష్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నయనతార – ఉదయనిది స్టాలిన్ సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు