Megastar: వరుసగా యంగ్ డైరెక్టర్స్ – మెగాస్టార్ ప్లాన్ ఏంటో..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. ఆ తర్వాత చిరంజీవి బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి డైరెక్షన్లో సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా కళ్యాణ్ కృష్ణ కురసాల, బీవీఎస్ రవి, వంటి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా నేనులోకల్, ధమాకా వంటి హిట్ సినిమాలకు కథను అందించిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఉండనుంది అంటూ వార్తలొస్తున్నాయి.  వీటిలో ఏ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన లేనప్పటికీ చిరంజీవి ఇలా వరుస పెట్టి యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.’ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల రిజల్ట్ చూసి చిరంజీవి ఆలోచన తీరు మారిందని అంటున్నారు.

అందుకే భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తన నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. చిరంజీవి ఇలా యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వటం వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు, అదేంటంటే యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తే తన రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్నా కూడా బడ్జెట్ పెరిగే సమస్య ఉండదు కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో చిరంజీవి లిస్ట్ లో ఆరుగురు యంగ్ డైరెక్టర్స్ ఉన్నారని, తరవాతి సినిమాలు వారితోనే చేయనున్నారని అంటున్నారు. మొత్తానికి రూటు మార్చిన మెగాస్టార్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు