Box office: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా విరూపాక్ష. కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా కి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రచన సహకారం అందించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21 న వరల్డ్ వైడ్ గా విడుదలై మార్నింగ్ షో నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

విరూపాక్ష లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సాయి చంద్, అజయ్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే విరూపాక్ష సినిమాకు గాను మొదటి రోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. విరూపాక్ష సినిమా విడుదల అయిన మొదటి రోజు మార్నింగ్ షో సగం మాత్రమే ఫుల్ కావడం తో ఫస్ట్ డే ఈ సినిమాకు 3 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేశారు. కానీ మార్నింగ్ షో లో అద్భుతమైన మౌత్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రానికల్లా భారీ గ్రోత్ ని చూపించింది. విరూపాక్ష ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.

నైజాం 1.82Cr , సీడెడ్ 54L , ఉత్తరాంధ్ర 58L , వెస్ట్ 47L , ఈస్ట్ 40L, గుంటూరు 46L , కృష్ణ 32L ,నెల్లూరు 20L టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల షేర్ ని వసూలు చేసింది. కర్ణాటక &ROI కలిపి 36L, ఓవర్సీస్ లో 1.20 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 6.35 కోట్ల షేర్ వసూలు చేయగా 11.85CR గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

ఇక విరూపాక్ష సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ తెచ్చుకున్న సినిమా గా నిలిచింది. ఇది వరకు సాయి నటించిన సినిమాల్లో విన్నర్ సినిమా 5.65 కోట్లు ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగా ఇప్పుడు రెండో పెద్ద ఓపెనింగ్ సినిమా గా విరూపాక్ష నిలిచింది. 23 కోట్ల టార్గెట్ తో విరూపాక్ష బరిలోకి దిగగా ఫస్ట్ డే 6. 35 కోట్లు వసూలు చేసింది. ఇంకా 16. 65 కోట్లు అందుకుంటే క్లీన్ హిట్ గా నిలబడుతుంది. ఇక ఈ వీకెండ్ రంజాన్ హాలిడే అడ్వాంటేజ్ తో మూడు రోజుల్లోనే విరూపాక్ష దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు