Kisi Ka Bhai Kisi Ki Jaan: పదేళ్లలో ఇదే తక్కువ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘కిసి కా భాయ్ కిసీ కా జాన్’. సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ అయిన ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్’ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా, బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సీరీస్ ఇంకా రీసెంట్ గా బచ్చన్ పాండే సినిమా తీసిన దర్శకుడు ఫర్హద్ సమ్జీ ఈ సినిమా ను డైరెక్ట్ చేశారు. తమిళం లో వచ్చిన అజిత్ వీరం సినిమా కి ఇది రీమేక్. దీన్నే తెలుగు లో పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు గా తీశారు.

ఏప్రిల్ 21 న రంజాన్ కానుకగా విడుదలైన కిసి కా భాయ్ కిసి కా జాన్ మిక్సడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా రాలేవు. సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో గత పదేళ్లలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకు అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒక్కసారి సల్మాన్ ఖాన్ నటించిన గత చిత్రాల ఓపెనింగ్స్ ని గమనిస్తే 2010: దబాంగ్ ₹ 14.50 కోట్లు
2011: బాడీగార్డ్ ₹ 21.60 కోట్లు
2012: ఏక్ థా టైగర్ ₹ 32.93 కోట్లు
2014: కిక్ ₹ 26.40 కోట్లు
2015: భజరంగీ భాయిజాన్ ₹ 27.25 కోట్లు
2016: సుల్తాన్ ₹ 36.54 కోట్లు
2017: ట్యూబ్‌లైట్ ₹ 21.15 కోట్లు
2018: రేస్3 ₹ 29.17 కోట్లు
2019: భారత్ ₹ 42.30 కోట్లు
2023: కిసి కా భాయ్ కిసి కా జాన్ ₹ 15.81 కోట్లు.

సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా 2010 లో 14.50 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ కిస్ కా భాయ్ కిసి కా జాన్ చిత్రం మాత్రం సల్మాన్ నటించిన సినిమాల్లో తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా గా నిలిచింది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు