Tollywood: యంగ్ హీరోతో పూరీ సినిమా – క్రేజీ కాంబినేషన్..!

హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చాలా మంది హీరోల కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు పూరీ డైరెక్షన్లో వచ్చినవే కావటం ఇందుకు నిదర్శనం. అయితే మునుపటి వైభవాన్ని కోల్పోయిన పూరీ, పుంజుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గతేడాది ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకొని తీసిన లైగర్ సినిమాతో డల్ అయిన పూరీ మరో సినిమా చేసేందుకు నూతనోత్సాహంతో సిద్ధమవుతున్నారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణలతో పూరీ సినిమా ఉండబోతోంది అంటూ వార్తలొచ్చినప్పటికీ అవేవి కార్యరూపం దాల్చలేదు.
తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో పూరీ సినిమా కన్ఫార్మ్ అయిందని వార్త సోషల్ మీడియాలో సంచరిస్తోంది. పూరీ చెప్పిన కథకి విశ్వక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. పూరీ మార్క్ హీరోయిజాన్ని సరిగ్గా సరిపోయే ఫీచర్స్ ఉన్న హీరో విశ్వక్ సేన్. ఈ కాంబోలో సినిమా అనగానే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూసర్ ఎవరు, హీరోయిన్ ఎవరు వంటి అంశాలు తెలియాల్సి ఉంది.
అంతా సవ్యంగా సాగి ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే పూరీ మార్క్ హీరోయిజం మరోసారి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. లైగర్ సినిమా సమయంలో విజయ్ తో జనగణమన సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి, లీగర్ డిజాస్టర్ కావటంతో ఆ ప్రాజెక్ట్  క్యాన్సిల్ అయింది. ఇప్పుడు విశ్వక్ సేన్ తో పూరి చేయబోయేది ఆ కథేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు తేరా దించాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు