Khushi : పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్న విజయ్ దేవరకొండ

పవన్ కళ్యాణ్ హీరోగా యస్.జె సూర్య దర్శకత్వంలో 2001లో వచ్చిన సినిమా ఖుషి. అప్పటివరకు మాస్ ఇమేజ్ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఖుషి సినిమాతో క్లాస్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పోయేలా చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ అయి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాని రీ-రిలీజ్ చేసిన కూడా సినిమాకి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వచ్చాయంటే ప్రేక్షకులకి ఖుషి సినిమా అంటే ఎంత అభిమానమో  అర్థం చేసుకోవచ్చు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ,శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఖుషి అనే పేరునే ఈ సినిమాకి కూడా పెట్టారు, అయితే పవన్ కెరీర్ లోనే ఖుషి సినిమాకి అత్యంత ప్రాధాన్యం ఉండటం వల్ల ఈ టైటిల్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు కానీ ఫ్యాన్స్ అభిప్రాయాలని పట్టించుకోని మూవీ టీం మొండిగా అదే పేరుని సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయించారు.అయితే ఈ మధ్యే విజయ్ సినిమాకి ఖుషి అనే పేరు పెట్టడంలో ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది.

పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో లాగే విజయ్ ఖుషి సినిమాలో కూడా ఇగో అనే కోర్ పాయింట్ మీద సినిమా ఉండబోతుందంట. కాలేజ్ ప్రేమించుకున్న విజయ్ ,సమంత ఇంట్లో గొడవపడి పారిపోయి పెళ్లి చేసుకుంటారంట కానీ ఇగో వాళ్ళ ఎక్కువ రోజులు ఉండలేక విడిపోతారంట ఆ తరువాత ఎం జరిగింది అనే నేపథ్యంలో సినిమా ఉండబోతుందంట సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాకి పార్ట్-2 గా ఉండబోతుందని టాక్. విజయ్, సమంతల పేర్లు కూడా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని సిద్దు ,మధు అనే పేర్లే పెట్టారని సమాచారం అందుకే ఈ సినిమాకి పట్టుబట్టి మరి ఖుషి అనే పేరునే కన్ఫామ్ చేసారని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.మైత్రి మూవీస్ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు