Tollywood: కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కాదా…?

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజ్, సంయుక్తల నటనకు ప్రశంసలు అందుతున్నాయి. హారర్ జానర్లో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డీల్ చేసిన విధానానికి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించటం ప్లస్ పాయింట్ అవ్వగా, కార్తీక్ కూడా సుకుమార్ శిష్యుడు అనుకొని అందరూ పొరబడుతున్నారు.

వివరాల్లోకి వెళితే కార్తీక్ కి ఇది రెండో సినిమా అని చాలా మందికి తెలీదు. కార్తీక్ గతంలో భమ్ బోలేనాథ్ అనే సినిమాకు డైరెక్షన్ చేశాడు. ఆ సినిమా వర్కౌట్ అవ్వకపోవటం వల్ల కార్తీక్ పేరు వెలుగులోకి రాలేదు. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వటం వల్ల కార్తీక్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాలేదు. అయితే విరూపాక్ష సినిమా కథ తీసుకొని చాలా మంది నిర్మాతల దగ్గరకు వెళ్లిన కార్తీక్, నిర్మాత అయిన సుకుమార్ స్నేహితుడి దగ్గరకు వెళ్ళటం ఆ కథ ఆయనకు నచ్చి సుకుమార్ వద్దకు తీసుకెళ్లటం ద్వారా లెక్కల మాస్టర్ ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యాడు.

స్నేహితుడి ద్వారా విరూపాక్ష సినిమాలో ఇన్వాల్వ్ అయిన సుకుమార్ సినిమా కథలో కొన్ని మార్పులు సజెస్ట్ చేశారట.  సుకుమార్ సూచించిన మార్పులు క్లైమాక్స్ లో కీలక ట్విస్ట్ లు అవ్వటం ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని దర్శకుడు కార్తీక్ అన్నాడు. ఏదేమైనా తొలి సినిమాతో గుర్తింపు పొందని కార్తీక్ సుకుమార్ శిష్యుడు అన్న ట్యాగ్ తో గుర్తింపుతో పాటు బ్లాక్ బస్టర్ కూడా సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు