Ustaad : కావ్య కళ్యాణ్ రామ్ సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా ?

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన కావ్య కళ్యాణ్ రామ్, గతేడాది వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

మసూద సినిమా సూపర్ సక్సెస్ అవడంతో కావ్య కళ్యాణ్ కి బలగం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ప్రియదర్శి హీరోగావచ్చిన ఈ సినిమాని , ఈటీవిలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో, టీం లీడర్ గా చేస్తున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే  బలగం సినిమా హిట్ విషయం పక్కన పెడితే పలు అవార్డులు, రివార్డులు గెలుచుకొని ఈ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాని హర్షిత్ రెడ్డి, హన్షిత లు నిర్మించారు.

బలగం సినిమా హిట్ తో, ఈ సినిమాకి పని చేసిన అందరికి బలగం అనేది వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయింది. అయితే ఇక విషయానికొస్తే బలగం సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ కాసేపటి క్రితం ఇంస్టాగ్రామ్ లో చాట్ సెషన్ కండక్ట్ చేసి ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ప్రస్తుతం టాలీవుడ్ లో మీ క్రష్ ఎవరు అని ఒక అభిమాని అడిగిన అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆమె నాగ చైతన్య ఫోటో పెట్టి, సిగ్గుపడింది.

- Advertisement -

అయితే ప్రస్తుతం కావ్య, శ్రీ సింహ హీరోగా వస్తున్న ఉస్తాద్ మూవీలో నటిస్తుంది.ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఇటీవలనే రిలీజై మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ఇప్పటికే రెండు సూపర్ హిట్లు అందుకున్న కావ్య, ఉస్తాద్ మూవీతో హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు