Boxoffice: రామబాణం కంటే ఉగ్రరూపానికే ఓటేస్తున్న జనం

టాలీవుడ్ లో రామబాణం, ఉగ్రం రెండు సినిమాలు ఒకేరోజు మే5 న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో రామబాణంలో మాస్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించగా, ఉగ్రం లో అల్లరి నరేష్ హీరోగా నటించాడు.

అయితే రెండు సినిమాల్లో రామబాణానికి డిజాస్టర్ టాక్ రాగా, ఉగ్రం సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు ఫస్ట్ షో నుంచే విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో రామబాణం చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.27 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలాగే ఉగ్రం సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఆ సినిమాకు సరైన ప్రమోషన్లు లేకపోవడం వల్ల, ఇంకా థియేటర్లు కూడా తక్కువ ఇవ్వడం వల్ల డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 73లక్షల షేర్ ని సాధించింది.

తాజాగా ఈ రెండు సినిమాల డే2 కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు రామబాణం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 81లక్షల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రామబాణం 2.13 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఈ సినిమా 15.20 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 13కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాలి.

- Advertisement -

ఇక అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా మొదటి రోజు తెలుగురాష్ట్రాల్లో 61లక్షల షేర్ వసూలు చేయగా రెండో రోజు కొద్దీ వరకు గ్రోత్ చూపించి మంచి వసూళ్లే రాబట్టింది. రెండో రోజు ఉగ్రం ఏపీ, నైజాం లో 67 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1.48 కోట్ల షేర్ వసూలు చేయగా, 2.93 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఉగ్రం మూవీ 5.80 కోట్ల బిజినెస్ చేయగా 6.50 కోట్ల టార్గెట్ తో విడుదలైంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల తర్వాత ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 5.02 కోట్ల షేర్ ని సాధించాలి.

ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇంకా రెండు మూవీస్ కి వచ్చిన టాక్ పరంగా ప్రేక్షకులు రామబాణం కంటే ఉగ్రం సినిమా వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. వీకెండ్ లో కీలకమైన ఆదివారం రోజు రెండు చిత్రాలు ఎలా పెర్ఫర్మ్ చేస్తాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు