Katrina Kaif : అందుకే సీక్రెట్ గా..

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలతోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన ఈమె ఇటీవల తోటి నటుడు, బాలీవుడ్ స్టార్ హీరో విక్వీ కౌశల్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి విధితమే. కత్రినా, కౌశల్ పెళ్లికి ముందు కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. గతేడాది ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. గతేడాది డిసెంబర్‌ 9వ తేదీన రాజస్థాన్‌ రాష్ట్రం లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

పెళ్లి అయ్యేంత వరకు కూడా పెళ్లి వార్తలపై స్పందించకుండా ఈ జంట ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువులు మధ్య కౌశల్, క్రతినా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రోజు తాము ఒక్కటి అయినట్లు అధికారికంగా ప్రకటించారు. పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ప్రేమ, పెళ్లి విషయంలో తాము గొప్యత పాటించడంపై తాజాగా కత్రినా స్పందించింది.

ఇటీవల జరిగిన ఒక ఆవార్డు కార్యక్రమంలో ఈ కొత్త దంపతులు పాల్గొన్నారు. దీనిలో కత్రినా కైఫ్ తన పెళ్లి గురించి పలు వివరాలను వెల్లడించింది. ‘కరోనా మహమ్మారి సమయంలో నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు అందరు కరోనా బారిన పడ్డారు. మళ్లీ నా పెళ్లితో మరిన్ని ఇబ్బందులు రావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని వల్లే కేవలం కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించాం. అంటూ వివరించింది. అలాగే ప్రస్తుతం తాము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు