Karthikeya 2 : బాలీవుడ్ బద్దల్

బాలీవుడ్ లో మంచి సినిమాలు లేక విలవిలలాడుతోంది. ఇటీవల వచ్చిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. దీంతో హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి సినిమా కరువైంది. ఇలాంటి సమయంలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 వచ్చింది. ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాలు నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మొత్తం బాలీవుడ్ గురించే. కార్తికేయ2 హిందీలో రిలీజ్ చేసిన మొదటి రోజు కేవలం 53 థియేటర్లు మాత్రమే వచ్చాయి. అలాగే 7 లక్షల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. కానీ ప్రస్తుతం సీన్ మారింది. 5 రోజుల వ్యవధిలో థియేటర్ ల సంఖ్య 1575 కు చేరుకుంది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. 4 రోజుల వ్యవధిలో 2.21 కోట్ల కలెక్షన్లు హిందీ బెల్ట్ రాష్ట్రాల నుంచే వచ్చాయి. వీకెండ్ కు తోడు ఆగస్టు 15 పబ్లిక్ హాలీడే కావడంతో బాలీవుడ్ లో కార్తికేయ2 కు ఆదరణ పెరిగింది.

కార్తికేయ 2పై పాజిటివ్ టాక్ నేపథ్యంలో థియేటర్ ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్ కు తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీనికి తోడు శ్రీ కృష్ణుడు, హిందుత్వం, ద్వారక నగరం గురించి అన్వేషణ లాంటి అంశాలు కార్తికేయ2 కు కలిసొచ్చాయి.

- Advertisement -

అలాగే బాలీవుడ్ లో మరో డిమాండ్ వినిపిస్తుంది. తమను నిరాశపరిచిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలను థియేటర్ ల నుంచి తీసివేయాలని, వాటి స్థానాల్లో కార్తికేయ2ను ప్రదర్శించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే #Karthikeya2Hindi అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు.

ఇదిలా ఉండగా కార్తికేయ2 ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 32.15 కోట్ల గ్రాస్ ను, 18.51 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ సినిమా, ప్రస్తుతం 5.21 కోట్ల లాభంతో నడుస్తుంది.

https://twitter.com/Mohit_gupta_177/status/1559537102307885056?s=20&t=sKLfW63UrX_uOvmiCotWIQ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు