Leo: ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్

లోకేష్ కనగరాజ్ ఒకప్పుడు తమిళ సినిమాకు మాత్రమే పరిమితమైన ఈ పేరు, ఈరోజు సౌత్ ఇండియా సినిమాలో ఒక బ్రాండ్. లోకేష్ కనగరాజ్ ఫిలిం అంటే లాంగ్వేజ్ సంబంధం లేకుండా వెయిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. లోకేష్ రీసెంట్ సినిమా లియో కి తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా బ్రహ్మ రథం పట్టారు.

మానగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్. తన ప్రతి సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ ఒక్కో సినిమా హిట్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా ఎదిగాడు.  లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఇకపోతే లొకేషన్ రీసెంట్ సినిమా లియో కి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందని చాలామంది చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయమై లోకేష్ కనగరాజ్ ను ప్రశ్నించింది తమిళ్ మీడియా.  దానికి లోకేష్ స్పందిస్తూ కలెక్షన్స్  విషయంలో ప్రొడ్యూసర్ హ్యాపీ. అది ప్రొడ్యూసర్ చూసుకుంటారు. ఆయనను రీసెంట్ గానే కలిశాను.  బట్ సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది అని విన్నాను.  సో అది కూడా నేనే చేశాను సో ఆ విమర్శ కూడా నేను తీసుకోవాలి.  ఆడియన్స్ అందరికీ సినిమా బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్.

- Advertisement -

దీంతో చాలామంది ట్విట్టర్ తెలుగు యువత తెలుగు డైరెక్టర్స్ ను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.  ఎందుకంటే తేరి రీమిక్ చేసున్నారు అని తెలిసినప్పుడు కొంతమంది చేసిన అతికి, హరీష్ శంకర్ ఎంతలా హర్ట్ అయ్యాడు మనం చూసాం.  ఇంకా ఎంతలా స్పందించాడో కూడా మనం చూసాం.  ఇకపోతే రీసెంట్ గా  విజయ్ తో వారీసు సినిమా చేసిన వంశీ పైడిపల్లి కూడా,  ఒక ఇంటర్వ్యూలో  సినిమా సీరియల్ లా ఉంది అంటే.  సీరియల్ అంటే “ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్” అంటూ యాంకర్ పై విరుచుకుపడ్డాడు. ఒక తమిళ్ డైరెక్టర్ విమర్శను తీసుకునే విధానాన్ని ఒక తెలుగు డైరెక్టర్ విమర్శ తీసుకునే విధానాన్ని కంపేర్ చేస్తూ తెలుగు ఆడియన్స్ స్పందిస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు