Dasara: ఇది 2023.. సినిమా హిట్ అవ్వాలంటే తల తెగాల్సిందే

ఈ సంవత్సరం టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ప్రేక్షకులను మెప్పించాయి అంటే అవి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఒకటి. మరొకటి నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై, 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాల తర్వాత తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఏ ఒక్కటి కూడా వీటి దరిదాపుల్లోకి కూడా రాలేవు.

అయితే ఈ నెల 30న విడుదలైన నేచురల్ స్టార్ నాని దసరా మూవీ తొలి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు, తొలి రోజు ఏకంగా 38 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా 51 కోట్ల షేర్ వసూలు చేయగలిగితే, బ్రేక్ ఈవెన్ అందుకున్నట్టే. ఇది జరగడానికి ఎన్నో రోజులు పట్టేట్టు లేదు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా అనవచ్చు.

అయితే సంక్రాంతి హిట్స్ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డికి ఇప్పుడు వచ్చిన దసరా సినిమాకి మధ్య ఒక పోలిక ఉంది. అదే ఈ మూడు సినిమాల్లో విలన్స్ తల తెగ నరకడం. వీర సింహా రెడ్డి సినిమాలో విలన్ దునియా విజయ్ తండ్రి తలను దునియా విజయ్ చేతే నరికేలా బాలయ్య చేస్తాడు. అలాగే వాల్తేరు వీరయ్య చిత్రంలో విలన్ అయిన ప్రకాశ్ రాజ్ తలను కోర్టు రూంలో చిరంజీవి నరికేస్తాడు.

- Advertisement -

ఇక దసరా చిత్రంలో అయితే తల నరికే సన్నివేశాలు ఏకంగా రెండు ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్ సమయంలో హీరో స్నేహితుడు సూరి తలను విలన్ నరికేస్తాడు. క్లైమాక్స్ లో విలన్ తలను నాని నరికేస్తాడు. క్లైమాక్స్ లో విలన్ తల నరికే సీన్ గూస్ బామ్స్ వచ్చేలా ఉంటుంది. అది సినిమాకే హైలైట్ అని దసరా చిత్రం చూసినవాళ్లు అంటున్నారు. ఈ తల నరుకుడు సెంటిమెంట్ దసరాకు బాగానే వర్కౌట్ అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సెంటిమెంట్ ప్రకారం దసరా చిత్రం.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

చూడాలి మరి, నాని దసరా చిత్రం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాల్లాగా 100 కోట్లు అందుకుంటుందో లేదో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు