Dasara: ఐపీఎల్ ఎఫెక్ట్.. అనుకున్నట్టే దెబ్బ పడింది

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా దసరా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన తొలిరోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అంతే కాదు హిందీ లో భోళా వల్ల ఎఫెక్ట్ పడుతుందనుకుంటే, దసరా వల్లే భోళా సినిమా కు దెబ్బ పడింది. అయితే భోళా సినిమా కు ప్రీమియర్స్ షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఖాళీగా ఉండే భోళా థియేటర్లను దసరా తో భర్తీ చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం దసరా 2 రోజుల కలెక్షన్స్ మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. 30 న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 53 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. అంతే కాదు ఓవర్సీస్ లో ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమా రెండో రోజు నైట్ షోలకు మాత్రం భారీ దెబ్బ పడింది.

కారణం ఏంటంటే 31 మార్చి నుండి ఐపీల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కాబట్టి నిన్న ఈవినింగ్ ఇంకా నైట్ షో లలో చాలా వరకు థియేటర్లు ఫుల్ కాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు ఐపీల్ ఎఫెక్ట్ వల్ల కేవలం 5.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే దసరా సినిమా కు 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 29 కోట్ల షేర్ వచ్చింది. అంటే టార్గెట్ దృష్ట్యా ఈ సినిమా మరో 21 కోట్లు అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమాకున్న పాజిటివ్ టాక్ వల్ల ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టం కాదు.

- Advertisement -

మార్నింగ్, మాట్నీ షోల్లో బాగానే జోరు చూపిస్తున్న ఈ సినిమా ఈవెనింగ్ ,సెకండ్ షోల్లో మాత్రం ఐపీల్ ఎఫెక్ట్ వల్ల భారీ నష్టం వస్తుంది. అదీ గాక ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర కూడా విడుదలవుతుంది. మరి ఈ ఆటంకాలని ఎదుర్కొని దసరా కు కలెక్షన్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు