నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘మనం’ తర్వాత నాగ చైతన్య- విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. దీంతో ఈ సినిమాపై తొలి నుండే మంచి అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ భామలు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ‘మారో’, ‘ఏంటో ఏంటేంటో’ లాంటి పాటలు కూడా మంచి మార్కులను కొట్టేశాయి.
ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని ముందుగా జూలై 8న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. జూలై 22న అంటే రెండు వారాల పాటు ‘థాంక్యూ’ మూవీ వాయిదా పడింది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఈ మధ్యనే మొదలుపెట్టారు. అనుకున్న సమయానికి, అంటే జూలై 8 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని తెలుస్తుంది.
సంగీత దర్శకుడు తమన్ ఇంకా ఆర్.ఆర్ ను కంప్లీట్ చేయలేదు అని వినికిడి. వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా ఉండడం వలన తమన్ ‘థాంక్యూ’ ఆర్.ఆర్ ఫినిష్ చేయడానికి ఆలస్యం అవుతుంది అని సమాచారం. థమన్ వల్లే థాంక్యూ వాయిదా పడిందని టాక్.