Vinodaya Sitham : సీక్రెట్ గా పవన్ మూవీ ?

పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీర మల్లు అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రోగ్రెస్ ఏంటి అన్నది పెద్ద మిస్టరీ.
నిజానికి, క్రిష్ సినిమాలకు ఎక్కువ సమయం తీసుకోడు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి సినిమానే 80 రోజుల్లో ఫినిష్ చేసి, రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం సినిమాల విషయంలో కూడా అంతే. మరి హరి హర వీర మల్లు విషయంలో ఆలస్యం ఎందుకు అవుతుంది అనే దానికి సమాధానం లేదు. ఎవరికి నచ్చిన సమాధానం వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సంగతి ఏంటో కూడా ఎవ్వరికీ తెలీదు.

కానీ, శుక్రవారం సైలెంట్ గా పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు మొదలైపోయాయి. అది వినోదయ సీతం రీమేక్ పనులు అని తెలుస్తుంది. సముద్ర ఖని డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. అయితే, శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాలకు హీరోలు హాజరు కాలేదు. రెండు నెలల వరకు మంచి ముహూర్తం లేదు అనే ఉద్దేశంతో సైలెంట్ గా వినోదయ సీతం పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తుంది.
కాగా, ఈ సినిమా జూలై రెండో వారం నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు