Dhamaka : డబుల్ ఖర్చులు

మాస్ మహారాజ్ రవితేజ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. హీరోగా లైనప్ లో చాలా చిత్రాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అందులో త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ధమాకా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా షూటింగ్ లో భాగంగా ఓ పాటను చిత్రీకరించాల్సి వచ్చింది. ఈ పాటకి వంద మంది ఫారిన్ అమ్మాయిలు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ అవసరం పడిందట. ఆ వంద మందిని ఫారిన్ నుండి తీసుకురావడం కష్టమే కదా. అందుకే నార్త్ లోనే ఫారిన్ అమ్మాయిలా కనిపించే వాళ్ళని సెర్చ్ చేసి, వారికి ఫ్లైట్ టికెట్ వేసి తీసుకొచ్చారు.

వీరి ఫ్లైట్ టికెట్ ఖర్చు 15 వేలు. తర్వాత వీళ్ళు రూమ్ లో బస చేయడానికి, తిండి కర్చులు కాకుండా వీరికి రోజుకి చెల్లించాల్సింది 7500 రూపాయలు. పోనీ ఒక్కరోజులో షూటింగ్ అవ్వగొట్టుకుని వాళ్ళని పంపేద్దాం అనుకుంటే సినీ కార్మికుల సమ్మె వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో, ఆ ఫారిన్ అమ్మాయిలలా కనిపించే వాళ్ళను 15 వేలు ఖర్చు చేసి ఫ్లైట్ లో పంపించేశారు. తీరా వాళ్ళు వెళ్ళాకా, సమ్మె క్యాన్సిల్ అయ్యింది. దాంతో మళ్ళీ వాళ్ళను ఫ్లైట్ లో తీసుకుచ్చి, షూటింగ్ పూర్తి చేసి, మళ్ళీ ఫ్లైట్ లోనే పంపారు నిర్మాతలు.
ఈ సమ్మెతో మిగితా సినిమాలకు ఎంత నష్టం వచ్చిందో తెలియదు కానీ, ధమాకా బృందానికి మాత్రం డబుల్ బడ్జెట్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు