Vikram : సంతానం పాత్రను రిజెక్ట్ చేశారు ?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది. వరల్డ్ వైడ్ గా ‘విక్రమ్’ 370 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో కమల్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు కూడా కనిపించారు. వీరిద్దరి నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సంతానం పాత్రలో విజయ్ సేతుపతి, ఓ పక్క భయపెడుతూనే మరో పక్క నవ్వులు కూడా పూయిస్తాడు.

‘మాస్టర్’ తర్వాత విజయ్ సేతుపతికి విక్రమ్ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్. అయితే, ఈ సంతానం పాత్రకు ముందుగా అనుకున్న నటుడు విజయ్ సేతుపతి కాదట. ముందుగా ఈ పాత్ర కోసం ప్రభుదేవా, లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్స్ కమ్ స్టార్ యాక్టర్లను లోకేష్ సంప్రదించాడట. కానీ వాళ్ళు ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. అందుకే ఆ పాత్రకు వాళ్లు నో చెప్పారట. దీంతో ఫైనల్ గా విజయ్ సేతుపతిని డైరెక్టర్ లోకేష్ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఏదిఏమైనా, విక్రమ్ సినిమాలో సంతానం పాత్రలో మరొక నటుడిని ఊహించుకోలేం. అంత బాగా విజయ్ సేతుపతి ఆ పాత్రకు న్యాయం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు