ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్టు కె’ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త టెక్నాలజీని వాడబోతున్నారు అనే ప్రచారం చాలా రోజుల నుండి జోరుగా జరుగుతోంది.
అది ప్రచారం కాదు నిజమే అని చెప్పొచ్చు. తాజా గా ఈ మేకర్స్ ఈ సినిమా కోసం 8 కోట్లు పెట్టి ఓ కెమెరాను తీసుకొచ్చారట. ‘ఒక్క కెమెరా కే ఇంత పెడుతున్నారా. ఈ డబ్బులతో ఒక లో బడ్జెట్ మూవీనే తీసేయొచ్చు’ అనే సెటైర్లు కూడా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.
మరి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ మూవీ కి ఇలాంటి భారీ ఖర్చు తప్పదు మరి. అంతేకాకుండా హాలీవుడ్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇంగ్లీష్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా ఉండబోతుందని ఇప్పటికే చెప్పాడు. అందు కోసం ఇలాంటివి చాలా అవసరమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక హై ఎండ్ మోషన్ పిక్చర్స్ ను క్యాప్చర్ చేయడం కోసం ఈ కెమెరాను వాడబోతున్నారని తెలుస్తుంది.