Sumanth : ‘సీతా రామం’ అయినా కలిసొస్తుందా?

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అక్కినేని నాగార్జున మేనల్లుడిగా.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమంత్ కు సక్సెస్ వెంటనే దొరకలేదు. హీరోగా 5 సినిమాలు చేస్తే దాదాపు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. 6వ చిత్రంగా వచ్చిన ‘సత్యం’ తో హీరోగా నిలదొక్కుకున్నాడు. అటు తర్వాత ‘గౌరి’ తో ఓ మాస్ హిట్ అందుకున్నాడు. ‘గోదావరి’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మళ్ళీ రావా’ సినిమాలతో పర్వలేదనిపించుకున్నాడు. కానీ ‘గౌరి’ తో వచ్చిన మాస్ ఇమేజ్ ను మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సుమంత్ హీరోగా నటించిన సినిమాలు అన్నీ కూడా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినవే.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావుగా కనిపించి అందరినీ మెప్పించాడు. కానీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో సహాయనటుడు పాత్రలు ఎక్కువ రాలేదు. చాలా రోజుల తర్వాత ఓ అవకాశం వచ్చింది. ‘సీతా రామం’ చిత్రంలో బ్రిగాడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌ అనే పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. దీనికి సంబంధింయిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ లో అతను చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ‘కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. దిస్ ఈజ్ బ్రిగాడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌’ అంటూ సుమంత్ చెప్పిన డైలాగులు కూడా బాగున్నాయి. మరి ఈ చిత్రంతో సుమంత్ కొత్త ఇన్నింగ్స్ కు శుభారంభం దొరుకుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు