Bimbisara : డైలాగ్ రైటర్ కి ఇంత డిమాండా ?

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రం గురించి ఎలాంటి హడావుడి లేదు. కానీ, ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైందో, అప్పటి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. యూట్యూబ్ లో ‘బింబిసార’ ట్రైలర్ 20 మిలియన్ కు పైగా వ్యూస్ ని రాబట్టి రికార్డు కొట్టింది. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకుడు. ట్రైలర్ లో విజువల్స్ ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకున్నాయో, డైలాగులు కూడా అదే విధంగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.

‘రాక్షసులు ఎరుగని రావణ రూపం. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి విశ్వరూపం’, ‘బింబిసారుడు అంటేనే మరణశాసనం. ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’, ‘పట్టుమని వంద మంది కూడా లేరు ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’ వంటి డైలాగులు మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీంతో ‘బింబిసార’ డైలాగ్ రైటర్ కు డిమాండ్ బాగా పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. ‘బింబిసార’ కి డైలాగులు రాసింది వాసుదేవ్ మునెప్పగారి. ఇదే మొదటి సినిమా. గతంలో ఏ సినిమాకి పని చేసింది లేదు. పోనీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా సరే ఈ 28 ఏళ్ళ కుర్రాడితో పనిచేయడానికి టాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు ఎగబడుతున్నారు అని వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు