Holi Special: హోలీ నేపథ్యంలో వచ్చిన తెలుగు సాంగ్స్ ఇవే..

కులమత బేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు అంబరాన్ని తాకుతాయి. అయితే, మన తెలుగు చిత్ర పరిశ్రమలో మన హీరోలు కొంతమంది హోలీపై కొన్ని పాటలను చిత్రీకరించారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా…!

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమాలో నాగార్జున రంగుల్లో మునిగితే తేలాడు. సాహితి రాసిన “కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు అంటూ…” నాగ్ హోలీ సెలబ్రేట్ చేశాడు. మాస్ కంటే ముందు నాగ్, సీతారామరాజు సినిమాలో రంగులు పూసుకున్నాడు. నందమూరి హరికృష్ణతో కలిసి ఈ సినిమాలో కూడా హోలీ సంబురాలు చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాలోను “హోలీ హోలీ పండగల్లే ఉల్లాసమేదో ఉప్పొంగుతుంది నాలో…” అని చల్లుకున్నాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తమన్నాతో కలిసి రంగులు చల్లుకున్నాడు.

1987లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమాలో కమలహాసన్ రంగులు జల్లుకున్నారు. అంతేకాక కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాలో “వయస్సంత ముడుపు కట్టి వసంతాలే ఆడుకుందాం..” లాంటి పాటలు బావ మరదలు మధ్య ఉండే హోలీ సరదాలను చూపించింది. వెంకటేష్ హీరోగా నటించిన ‘జెమిని’ సినిమాలోని ‘దిల్ దివానా’ కూడా హోలీ నేపథ్యంలో తెరకెక్కింది. అలాగే ఇటీవల రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాలో కూడా కలర్స్.. అంటూ ఓ హోలీ సాంగ్ ఉంది. అనేక సినిమాల్లో హోలీ సన్నివేశాలు తెలుగు తెరమీదకు రంగులను పులిమాయి. నీ స్నేహం, ఇంద్ర, ఓయ్, హోలీ లాంటి సినిమాల్లో హోలీ సీన్స్ తో హీరోలు రంగులు పూసుకున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు