Hi Nanna: వారంలో పనవుద్ధనుకున్నారు.. కానీ ఇంకా కావాలి!

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో “హాయ్ నాన్న” ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే క్లాస్ సినిమా అవడం వల్ల, అందులోనూ ఎలక్షన్స్ టైం లో రావడం వల్ల యావరేజ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ మౌత్ టాక్ బలంతో, ఓవర్సీస్ ఆడియన్స్ అండతో వీకెండ్ లో హాయ్ నాన్న మంచి వసూళ్లు సాధించింది. పైగా దీనికి పోటీగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా నిరాశ పరచడంతో సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అనుకున్నారు.

కానీ వీకెండ్ తర్వాత చల్లబడిన హాయ్ నాన్న ఓవర్సీస్ నైజాం లో మాత్రమే బెటర్ వసూళ్లు అందుకుంటున్నాడు. తాజాగా ఫస్ట్ వీక్ పూర్తవగా, రిలీజ్ అయిన వారం రోజుల్లో హాయ్ నాన్న వరల్డ్ వైడ్ గా 25.85 కోట్ల షేర్ సాధించింది. అయితే వారంలోపే బ్రేక్ ఈవెన్ అవుతుందనుకున్నా కొద్దిలో మిస్ అయింది. 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా టార్గెట్ ని అనుకోవాలంటే ఇంకా 2.65 కోట్ల షేర్ వసూలు చేయాలి.

అయితే ఈ వారం పెద్దగా చెప్పుకోగల సినిమాలేవీ రాకపోవడంతో రెండో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి వెళ్లడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి హాయ్ నాన్న ఓవరాల్ గా ఎంత వరకు వసూళ్లు అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు