Oh my Baby song: నెటిజన్లు కుక్కలా రామజో..? ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సింది ఎవరు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 2024 సంక్రాంతి కానుక గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ ఉన్న హైప్ ని అమాంతం పెంచేయగా, లేటెస్ట్ గా ఓ మై బేబి అంటూ ఓ రొమాంటింక్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటను త్రివిక్రమ్ హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించడం జరిగింది.

అయితే ఈ పాట రిలీజ్ కి ముందు ఉన్న అంచనాలన్నీ, విడుదల అయ్యాక ఒక్క్కసారిగా నీరు గారిపోయాయి. సినిమా ట్యూన్స్ బాగా లేవంటే, లిరిక్స్ అంతకన్నా దరిద్రంగా ఉన్నాయంటూ మ్యూజిక్ డైరెక్టర్ పై, లిరిసిస్ట్ పై ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. గురూజీ సినిమాలకి అందించే పాటలేనా ఇవి.., మహేష్ బాబు కి ఇలాంటి పాటలిస్తారా? అంటూ మూవీ మేకర్స్ ని ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియా లో తిట్టడం మొదలెట్టారు.

అయితే ఈ విషయంపై ఆ పాట రాసిన రచయిత రామ జోగయ్య శాస్త్రి తాజాగా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవడం జరిగింది. మామూలుగా ఎలాంటి పాట రాసినా ఆ పాట మెప్పించకపోతే, శాస్త్రి ఆ పాటపై వచ్చే నెగిటివ్ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోడు. కానీ ఈ సారి ఎంత కాలిందో తెలీదు గాని ట్రోలింగ్ బ్యాచ్ పై మహేష్ ఫ్యాన్స్ అని కూడా పట్టించుకోకుండా ఫైర్ అయ్యాడు. పాట రిలీజ్ అయినప్పటినుండే రామ్ జో పై ఫ్యాన్స్ విమర్శల యుద్ధం చేయగా, దానికి ఆయన కూడా ఎదురు దాడికి దిగాడు. ఆ ట్వీట్ లో రామజోగయ్య శాస్త్రి రెస్పాండ్ అవుతూ

- Advertisement -

“ప్రతివాడు మాట్లాడేవాడే, రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది.
పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే..
ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అని ట్వీట్ పెట్టాడు.

అయితే ఈ ట్వీట్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా బాగా మండింది. అక్కడ్నుంచి మరింత రెచ్చిపోయారు విమర్శకులు. పాట పై వచ్చిన విమర్శలకు మరో పాట తో బదులివ్వాలి, లేదా పాటకు ఏం తక్కువ చేసామో ఆలోచించి, తర్వాత మంచి ట్యూన్స్ ఇచ్చి పరువు నిలబెట్టుకోవాలి. అంతే కానీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి తమ తిట్టించుకొని తమ పరువును గంగపాలు చేసుకోరాదు అంటూ ఈ సరస్వతి పుత్రుడికే హితబోధ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆడియన్స్ కి.

గతంలో సిరివెన్నెల, చంద్ర బోస్ వంటి వారికి కూడా ఇలాంటి అవమానాలెన్నో సోషల్ మీడియా వేదికగా జరిగాయి. కానీ ఇలాంటివి వాళ్ళు ఎన్నడూ పట్టించుకోలేదు సరికదా, ఆ తిట్లను కూడా స్వీకరించి తమ తప్పును తెలుసుకొని సరిదిద్దుకున్నారు. అందుకే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో మనందరికీ తెలిసిందే. మరి అంత అనుభవం ఉన్న శాస్త్రే ఇలా నిగ్రహం కోల్పోతే, అప్ కమింగ్ రైటర్స్ ఈయన దగ్గర చూసి ఏమి నేర్చుకొంటారని ట్రేడ్ విమర్శకులు కూడా అంటున్నారు.

అన్నిటికి మించి ఓ సందర్భంలో సోషల్ మీడియా వాళ్ళని ఓ రకంగా కుక్కలు అనేసి నోరు జారాడు రామ్ జో. ఇదేంటని ప్రశ్నిస్తూ ఫ్యాన్స్ ను తప్పుపడతారేమిటి? వాళ్లు బాధ పడడం కూడా తప్పేనా? అంటూ ట్రేడ్ విమర్శకులు వాదిస్తే, దానికి రామ్ జో తప్పుగా మాట్లాడిన వాళ్ళని తప్పుబట్టాను, సరిగా మాట్లాడమని చెప్పాను అంటూ సమర్ధించుకొన్నారు. ఏది ఏమైనా రామజోగయ్య శాస్త్రి తన సహనం కోల్పోయి నోరు జారాడు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పొరపాటును ఆయన ఎంత త్వరగా సరిదిద్దుకుంటే అంత మంచిదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు