Abhishek Bachchan: కరిష్మా కపూర్ ను అభిషేక్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం..?

బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా పేరుపొందిన ఐశ్వర్యరాయ్ , అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి కనిపిస్తారు. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలలో మరొకసారి ట్రెండీగా మారుతోంది ఈ జంట. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో అభిమానులు కూడా నిజమేనేమో అనేంతలా అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ గురించి వారి గతాలను సైతం తిరిగి తవ్వేస్తూ ఉన్నారు. ఈ జంట 2007 ఏప్రిల్ 20 వ తేదీన వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ ఆరాధ్య అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే ఏమైందో తెలియదు కానీ అభిషేక్ , ఐశ్వర్య విడిపోతున్నారని పలు రకాల మీడియాలలో వినిపిస్తూ ఉన్నాయి.. కేవలం వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయబోతున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఐశ్వర్యరాయ్ ను వివాహం చేసుకోవడానికి కంటే ముందుగా అభిషేక్ బచ్చన్ హీరోయిన్ కరిష్మా కపూర్ ను వివాహం చేసుకోవాలనుకున్నారనే వార్త వైరల్ గా మారుతోంది.

అభిషేక్ బచ్చన్ కు 2002 లో కరిష్మా కపూర్ తో నిశ్చితార్థం జరిగిందని.. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని కానీ కొన్ని కారణాల చేత కరిష్మా ఎక్కువగా జల్సాలకు తిరగడంతో బచ్చన్ కుటుంబం నుంచి బయట నివసించాలనే కోరికతో అభిషేక్ బచ్చన్ కి ప్రెషర్ పెట్టడంతో అతను తన వివాహాన్ని సైతం రద్దు చేసుకున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వివాహం అనంతరం అభిషేక్ బచ్చన్ కుటుంబంతో కాకుండా విడిగా జీవించాలనుకున్నట్లు కరిష్మా కపూర్ అప్పట్లో సమాధానం చెప్పినట్లు సమాచారం.

- Advertisement -

అయితే తల్లిదండ్రులను ఇష్టంగా ప్రేమించే అభిషేక్ బచ్చన్ ఆ సమయంలో తన వివాహాన్ని సైతం తల్లిదండ్రుల కోసం త్యాగం చేశారని.. అందుకే కరిష్మా కపూర్ ను వివాహం చేసుకోలేదని తెలుస్తోంది.. ఇదే కండిషన్ నే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కి కూడా పెట్టారని..అయితే ఆమె ఒప్పుకోవడంతో ఆపైన వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

డి ఆర్చిస్ స్కిన్నింగ్ సమయంలో తప్ప ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ చాలా కాలం నుంచి ఎలాంటి ఫంక్షన్లకు, పార్టీలకు సైతం పెద్దగా కనిపించలేదు.. ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ వివాహ ఉంగరాన్ని కూడా వేలి నుంచి తొలగించారని ఆధారాలు కూడా వున్నాయి… మరి వీరిద్దరూ విడాకుల వ్యవహారంపై ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు