Sundeep Kishan : మీమర్ కు హీరో స్ట్రాంగ్ కౌంటర్… మంచోడు కాబట్టే పద్ధతిగా లేదంటేనా… 

సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత సెలబ్రిటీలు, అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా మీమర్స్ బాగా పెరిగిపోయారు. అయితే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు హద్దులు దాటి సెలబ్రిటీలపై కామెంట్స్ చేసి తిట్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయి. తాజాగా “ఊరు పేరు భైరవకోన” మూవీ టీం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. హీరో సందీప్ కిషన్ కు కోపం తెప్పించే విధంగా ఓ మీమర్ డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన ప్రశ్నలు అడిగాడు. దీంతో సందీప్ కిషన్ ఆ మీమర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవకోన”. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి తాజాగా “ఊరు పేరు భైరవకోన” టీం మీమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. దాంట్లో భాగంగా మీమర్స్ అందరూ హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడిని వాళ్లకు తోచిన ప్రశ్నలు అడిగారు. కానీ ఒక వ్యక్తి మాత్రం కాస్త ఓవరాక్షన్ చేసి హీరో హీరోయిన్లను ఇబ్బంది పెట్టాడు. ముందుగా హీరోయిన్ ను “మీ పేరు భూమి కదా? మీ భూమి మాకు రాసిస్తారా?” అంటూ ఇబ్బంది పెట్టే ప్రశ్నను వేశాడు. దీంతో వర్ష “ఆ ఛాన్స్ లేదు వేరే వాళ్లకు ఇచ్చేశాను” అంటూ సమాధానం చెప్పింది. ఆ తర్వాత సందీప్ కిషన్ ను టార్గెట్ చేశాడు ఈ మీమర్.

సినిమాలో హీరోయిన్ తో అలా చేశారు కదా… ఎలా అనిపించింది? ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరోయిన్ తో బాగా అనిపించింది? ఏ హీరోయిన్ తో ఎక్కువ ఎంజాయ్ చేశారు? అంటూ డబుల్ మీనింగ్ క్వశ్చన్స్ అడిగాడు. దీంతో చిరాకు వచ్చిన సందీప్ స్పందిస్తూ “ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను. కొన్ని జోక్ గా చెప్పినా కూడా డబుల్ మీనింగ్ అవుతాయి. స్టేజ్ మీద అమ్మాయి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. వేరే ప్రశ్న అడుగు చెప్తాను” అని అన్నాడు. అయినా కానీ ఆ మీమర్ మళ్ళీ మళ్ళీ అలాంటి ప్రశ్నలే అడగడంతో సందీప్ వార్నింగ్ ఇచ్చాడు.

- Advertisement -

“నీ మాతృభాష ఏంటి? తెలుగులో నటించడం అనే పదం ఉంది కదా. యాక్టింగ్ ఎవరితో బాగా చేశారు అని అడుగు. ఇలాంటి అలవాటు స్టార్ట్ చేసుకోవద్దు. డబుల్ మీనింగ్ వచ్చేలా ప్రశ్నలు అడగకు. నేను వద్దు అని చెబుతున్నా కూడా మళ్లీ మళ్లీ అలాగే అడుగుతున్నావు. ఈ పద్ధతి మంచిది కాదు మానుకో” అంటూ కూల్ గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు సందీప్ మంచివాడు కాబట్టే పద్ధతిగా సమాధానం ఇచ్చాడు. లేదంటే కథ వేరేలా ఉండేది అంటూ సందీప్ కిషన్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు