Health : స్మోకింగ్ మధ్యలో మానేసిన వారిదే గట్టి ఆయుష్షు 

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట మనం తరచుగా వింటూనే ఉంటాము. ఏదో ఎగ్జైట్మెంగ్ లో తాగడం తాగడం స్టార్ట్ చేసి, ఆ తరువాత తెలియకుండానే అడిక్ట్ అయిపోతారు. రోజురోజుకూ సిగరెట్ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే దానివల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. ధూమపానం అనేది ముఖ్యంగా క్యాన్సర్ కు కారణం అవుతుంది. పొగ తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారు. అలాగే గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిగరెట్ తాగడం వల్ల ప్రతి ఏడాది లక్షలాది మంది చనిపోతున్నారు. ఇవన్నీ తెలిసినా సిగరెట్ తాగే వాళ్ళు తమ అలవాటు మార్చుకోరు. కనీసం లెక్క చేయనంతగా అడిక్ట్ అయిపోతారు. కానీ సిగరెట్ తాగేయడం మానేయాలనుకుంటున్న వారికి తాజాగా జరిగిన ఒక అధ్యయనం గుడ్ న్యూస్ చెప్పింది. సిగరెట్ తాగేవారు మధ్యలో మానేస్తే వారి ఆయుష్షు సిగరెట్ తాగని వారి కంటే ఎక్కువగా పెరుగుతుందట.

యూనివర్సిటీ ఆఫ్ టోరెంటోలో జరిగిన తాజా పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయనంలో 40 ఏళ్లలోపు స్మోకింగ్ మానేసిన వారు, లైఫ్ లో ఎప్పుడూ సిగరెట్ తాగని వారితో సమానంగా జీవిస్తారని ప్రూవ్ అయ్యింది. ఏ వయసు వారైనా సరే స్మోకింగ్ విడిచి పెడితే ఆ తర్వాత తమ లైఫ్ టైం కంటే ఓ పది సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతారట. అలాగే స్మోకింగ్ మానేయడం ద్వారా వచ్చే మార్పులను కేవలం మూడేళ్లలోనే గుర్తించగలరని ఈ అధ్యయనం నిరూపించింది. ధూమపానం మానేయడం వల్ల మరణించే ప్రమాదం తగ్గిపోతుందని, చాలా త్వరగా ఆరోగ్యంగా మారిపోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చి ఎందరో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ అలవాటుతో ఆయుష్షు సగానికి పైగా తగ్గిపోతుంది. దీంతో త్వరగా అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంటారు.

తాజాగా జరిగిన ఈ పరిశోధనల్లో నాలుగు దేశాల ప్రజలు పాల్గొన్నారు. యూఎస్, కెనడా, యూకే నార్వే ప్రజలపై 15 సంవత్సరాల పాటు జరిపిన అధ్యయనంలో ఎప్పుడూ ధూమపానమే చేయని వాళ్లతో పోలిస్తే 40 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న సిగరెట్ తాగేవారు చనిపోయే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని తేలింది. అంటే తమ జీవితంలో దాదాపు 12 నుంచి 13 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్మోకింగ్ చేస్తున్నవారు ఆలస్యం అయిపోయింది అని అనుకోకుండా ఇప్పటికైనా మానేస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది అనేది నిజం. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ ను వదిలేసి ఇంకొంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకండి.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు