Razakar Director : రాఘవేంద్ర రావు శిష్యుడు… “రజాకార్” వివాదంతో గురువు పేరు చెడగొడతాడా?

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న వివాదాస్పద సినిమాల్లో “రజాకార్” మూవీ కూడా ఒకటి. పోస్టర్లు, టీజర్, టైటిల్… ఇలా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన కంటెంట్ అంతా తీవ్ర వివాదాలకు నెలవైంది. ముఖ్యంగా బీజేపీ నేతలు, టిఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఇక డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఈ సినిమాతో కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మరి ఆయన తన గురువు రాఘవేంద్ర రావు పేరును చెడగొట్టడానికే ఇలా చేస్తున్నాడా? అంటే…

యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మిస్తున్న మూవీ “రజాకార్ : ది సైలెంట్ జెనోసైడ్”. తెలంగాణలో రజాకార్ల దాడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాటి, ఇంద్రజ, ప్రేమ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు. మార్చి 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ కంటెంట్ అంతా వివాదానికి తెరతీసింది. ముఖ్యంగా తమను టార్గెట్ చేసే ఈ సినిమాను తీశారంటూ ముస్లిం మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు మండిపడ్డారు. మరోవైపు మేకర్స్ మాత్రం హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి ప్రపంచానికి తెలియని విషయాలను ఈ సినిమాలో చిత్రీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. వాస్తవాలను అందరి ముందుకు తీసుకురావడమే తమ ఉద్దేశం అంటున్నారు. మరి రిలీజ్ కు ముందే ఇంతటి వివాదాలకు దారి తీసిన “రజాకార్” థియేటర్లలోకి వస్తే మరెంత దుమారం చెలరేగుతుందో.

ఈ నేపథ్యంలోనే “రజాకార్” లాంటి కాంట్రవర్షియల్ సినిమాలతో డైరెక్టర్ సత్యనారాయణ తన గురువు రాఘవేంద్రరావు పేరు చెడగొడతాడా ? అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వివాదాలకు దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన స్కూల్ నుంచి వచ్చిన సత్యనారాయణ మాత్రం ఇంత పెద్ద కాంట్రవర్సీ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇదే ప్రశ్నను డైరెక్టర్ సత్యనారాయణ ముందు ఉంచగా ఆయన స్పందిస్తూ ఇది వివాదం కాదని, హిస్టరీ అని అన్నారు. ఫిల్మి ఫైకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ “ఖచ్చితంగా గురువు గారు వివాదాలకు దూరంగా ఉంటారు. నేను కూడా ఇది వివాదం కాదు హిస్టరీ కాబట్టే దిగాను. హిస్టరీని వివాదం చేయొద్దు అని చెబుతున్నాను. పర్సనల్ గా నేను ఏ వివాదానికైనా రెడీగా ఉంటాను. కానీ ఈ
సినిమా విషయానికొస్తే ఇదొక హిస్టరీ. దాన్ని అలాగే చూడండి” అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు