Tollywood:గోపీచంద్.. ఆరడుగుల పర్ఫెక్ట్ మాస్ కటౌట్..

గోపీచంద్.. టాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో.. అందరు హీరోలు మెచ్చే ఆరడుగుల బుల్లెట్ ఇతడు. ఎదురుగా ఉండే విలన్ ఆ కటౌట్ చూసే భయపడ్డాడంటే ఆ హీరో గోపిచంద్ అని అర్థం. చిరంజీవి, రజినీకాంత్ లాంటి హీరోల స్ఫూర్తి తో విలన్ గా ఫేమస్ అయ్యి తర్వాత హీరోగా మారి విభిన్న కథా చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన గోపీచంద్ బర్త్ డే(జూన్ 12) ఈరోజు. ఈ సందర్భంగా filmify టీమ్ తరపున ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుతూ తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం.

చాలా మంది గోపిచంద్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చాడు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. తెలుగులో ప్రతిఘటన, వందేమాతరం లాంటి సంచలనం చిత్రాలు తీసిన అలనాటి దర్శకుడు టి. కృష్ణ గోపీచంద్ తండ్రి కావడం విశేషం. అయితే గోపీచంద్ చిన్నతనం లోనే ఆయన తండ్రి చనిపోవడం వల్ల ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

టాలీవుడ్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన “తొలివలపు” చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన గోపీచంద్ మొదటి సినిమాతోనే ప్లాప్ ని అందుకున్నాడు. ఆ సినిమాలో గోపిచంద్ ని
చూసిన వాళ్ళందరూ ఇతను హీరో ఏంటి, సినిమాల్లో విలన్ గా కూడా పనికి రాడు అని ట్రోల్ చేసారు. అలా కెరీర్ బిగినింగ్ లోనే సరైన సపోర్ట్ కూడా లేక చాలా కష్టాలు పడ్డాడు గోపిచంద్.

- Advertisement -

ఒంటిమీద రక్తంతో మూడు రోజులు…

ఆ సమయంలో డైరెక్టర్ తేజ ప్రోత్సాహం తో విలన్ గా మారి తన కెరీర్ ని నిలబెట్టుకున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నిజం సినిమాల్లో ప్రతినాయకుడిగా అద్భుతమైన నటనని కనబరిచాడు. ఈ సినిమాల్లో హీరో కంటే విలన్ అయిన గోపీచంద్ కే ఎక్కువ ప్రశంసలు లభించాయి. ఇక నిజం సినిమాలో గోపిచంద్ ఒక సీన్ లో నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తాడు. ఈ షాట్ కోసం డైరెక్టర్ తేజ గోపీచంద్ పై రియల్ గా రక్తం పోస్తాడు. ఆ సీన్ షూటింగ్ కోసం గోపిచంద్ స్నానం చేయకుండా ఒంటి పై రక్తంతో మూడు రోజులున్నాడు. గోపీచంద్ డెడికేషన్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు.

వీటితో పాటు ప్రభాస్ వర్షంలోనూ విలన్ గా నటించాడు. ఈ సినిమాతోనే ప్రభాస్,గోపిచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని మనందరికీ తెలిసిందే.

ఇక యజ్ఞం సినిమా తో హీరోగా గోపిచంద్ హీరోగా తొలి సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో మాస్ హీరోగా అడుగుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రుడు తో బ్లాక్ బస్టర్ కొట్టడమే గాక టాలీవుడ్ లో పోలీస్ పాత్రలకు కేరాఫ్ అయ్యాడు. రణం, లక్ష్యం, శౌర్యం, గోలీమార్ వంటి కమర్షియల్ హిట్లతో తన మాస్ హీరోగా ఇండస్ట్రీ లో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు.

హీరోగా కమర్షియల్ చిత్రాలే గాక ఒక్కడున్నాడు, సాహసం, గౌతమ్ నంద లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సినిమాలపై తనకుండే ప్యాషన్ ఎలాంటిదో చెప్పాడు. ఇప్పుడంటే నయా హీరోల డామినేషన్ వల్ల, తన ప్లాపుల వల్ల కొంచెం వెనుక బడ్డాడు కానీ, ఒకప్పుడు గోపీచంద్ సినిమా అంటే బీ,సీ సెంటర్లలో ఎగబడి చూసే వాళ్ళు. గోపీచంద్ సినిమా అంటే మినిమం ఉంటదిరా అనేవాళ్లు. నిజం చెప్పాలంటే టాలీవుడ్ ఏ దర్శకులకి గోపీచంద్ ని ఎలా వాడుకోవాలో అర్థం కావట్లేదు. గోపీచంద్ కటౌట్ కి తనకున్న క్రేజ్ కి బోయపాటి శ్రీను, పూరిజగన్నాథ్ లాంటి దర్శకులు ఒక మాస్ యాక్షన్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఊచకోత కోయడం గ్యారెంటీ.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు