Arcus Films: అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్న “స్కైఫై” జోనర్ చిత్రం

టాలీవుడ్ లో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న కొత్త చిత్రం 7:11PM. సాహస్ పగడాల హీరోగా, దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ లో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సంయుక్తంగా నిర్మిస్తుండగా, చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నాడు.

అసలు ఈ సినిమాకు పేరును టైమ్ గా పెట్టడంతోనే ఈ సినిమాపై అంచనాలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా యొక్క టీజర్ సరికొత్తగా ఉండి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఆ టీజర్ లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ సినిమాపై ఉన్న అంచనాలని ఓ రేంజ్ లో పెంచేసాయి. వీటికి తోడు సినిమాలో సరైన కంటెంట్ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అయితే సినిమాలో స్టార్స్ లేకపోవడం వల్ల, బడ్జెట్ లోపం వల్ల ఈ సినిమా మేకింగ్ క్వాలిటీ అంత బాగాలేదు. ఈ విషయం పై మేకర్స్ కొంచెం శ్రద్ధ వహించి రీషూట్ చేస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా 7:11PM చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. జూన్ 30న తమ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది. అసలెప్పుడు మొదలైందో కూడా తెలియని ఈ సినిమా ఈ మధ్యనే టీజర్ తో వచ్చి ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయితే జూన్ 30న విడుదల అంటే కనీసం మూడు వారాల టైమ్ కూడా లేదు. అందువల్ల ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో ప్రమోషన్లు చేయడం దీనికి కలిసొచ్చే అంశం. ఇక సినిమా రిలీజ్ టైమ్ వచ్చే వరకు చిత్ర యూనిట్ తమ ప్రమోషన్లతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు