Dutt sisters: ఎగిసే కెరటాలు

Dutt sisters

సినీ పరిశ్రమలో డబ్బు రావడం, డబ్బుపోవడం, సక్సెస్ , ఫెయిల్యూర్ ఇవన్నీ మాములుగా జరిగేవే కానీ సినీ పరిశ్రమలో నిలబడటమే ఇంపార్టెంట్ అని చాలా తక్కువమంది నిర్మాతలు నమ్ముతారు. అటువంటి నిర్మాతలలో అశ్వని దత్ ఒకరు. “ఓ సీత కథ” సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి, ఎదురులేని మనిషి సినిమాతో వైజయంతి బ్యానర్ ను స్థాపించారు. సంగీతానికి పెద్ద పీట వేస్తూ మంచి సూపర్ హిట్ సాంగ్స్ ను అందించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే సినిమాలను నిర్మించారు. కానీ ఈ బ్యానర్ కూడా ఒక కాలంలో తీవ్ర నష్టాలను చవిచూసింది. కంత్రి, శక్తీ లాంటి సినిమాలు ఈ బ్యానర్ ను కోలుకోలేని లోతుల్లో పడేసాయని సినీ ప్రముఖుల అభిప్రాయం.

మాములుగా ఒక సినిమాకి సక్సెస్ ఫార్ములా ఏమిటి? ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలంటే చాలా కమర్షియల్ హంగులు ఉండాలని చాలా మంది నమ్ముతారు. అయితే, సినిమాకి కంటెంట్‌ ఉంటే చాలు, మంచి కథతో కూడిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని కొందరు నమ్ముతున్నారు. అలాంటి వారిలో దత్ సిస్టర్స్ ఒకరు.

బుల్లి తెరపై వారి ప్రయాణాన్ని ప్రారంభించి కొన్ని టీవీ షోలతో ఘోరంగా విఫలమై నష్టాలను చవిచూసారు. ఎట్టకేలకు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ ఎవడే సుబ్రహ్మణ్యం అనే ఫీచర్ ఫిల్మ్‌తో వారి మొదటి విజయాన్ని రుచి చూశారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా విమర్శకుల ప్రశంసలు పొంది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి, జాతిరత్నాలు, ఇటీవల విడుదలైన సీతా రామం సూపర్‌హిట్‌లుగా మారాయి.

- Advertisement -

‘‘ఈ తరం ప్రేక్షకులకు కథ కనెక్ట్ కాకపోవచ్చునని మహానటి సినిమా సమయంలో చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ మహానటి రిలీజయ్యాక పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆదరించారు. సీతా రామం విషయంలో కూడా అలాగే జరిగింది.
ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలనే చూస్తున్నారని అందరి అభిప్రాయం. అయితే అందుకు భిన్నంగా సీతా రామం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.

విజయానికి ప్రత్యేక ఫార్మాట్ అంటూ ఏమీ ఉండదని స్వప్న దత్ అంటుంటారు. “నా అభిప్రాయం ప్రకారం, ప్రేక్షకులు నిజంగా భారీ ఫైట్లు, స్టార్ కాస్ట్, ఐటమ్ సాంగ్స్ మొదలైనవాటిని అడగరు. కథ బాగుంటే తప్పకుండా ప్రోత్సహిస్తారు.” ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ నిర్మాతలు ప్రస్తుతం డిఫరెంట్ జానర్ సినిమాలను రూపొందిస్తున్నారు మరియు వివిధ నిర్మాణ దశల్లో ఉన్న కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను లైన్‌లో ఉంచారు.జీవితంలో చాలామంది కింద పడతారు, కానీ కొంత కొంతమందే మాత్రమే అంతకంటే వేగంగా పైకి లేవగలుగుతారు, అచ్చం ఎగిసే కెరటాలు లాగ అలాంటి వారిలో దత్ సిస్టర్స్ ఒకరు అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఈ బ్యానర్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం “ప్రాజెక్ట్-కె” ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి, చరిత్రలో నిలిచి పోయే మరిన్ని గొప్ప సినిమాలు చేయాలనీ, దత్ సిస్టర్స్ లో ఒకరైన “స్వప్న దత్” కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు