Teja sajja : రామ్ చరణ్ తో పోటీ పడుతున్న యంగ్ హీరో ?

తేజ్ సజ్జ హీరోగా వస్తోన్న హనుమాన్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తోన్నఈ సినిమా సమ్మర్ హాలిడేస్ లోనే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.

హనుమంతుడి శక్తులు ఒక పాతికేళ్ల కుర్రాడికి వస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజ సజ్జ, ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అవ్వగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని కూడా టచ్ చేయబోతున్నారు.

గతంలో మూవీ టీం రిలీజ్ చేసిన టీజర్ తో అందరి అంచనాలను పెంచేసింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో దాదాపు 1600+VFX షాట్స్ ఉండబోతున్నాయంట. ఇప్పటి వరకు ఫాంటసీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలలో మగధీర సినిమాలో1600 VFX షాట్స్ ఉండగా, మళ్ళీ ఇన్ని షాట్స్ హనుమాన్ సినిమాలోనే ఉండబోతున్నాయి. మొదట్లో మీడియం బడ్జెట్ సినిమాగా అనుకోని స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్, రోజురోజుకి పెద్ద బడ్జెట్ సినిమాగా మారుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మూవీ టీం చాలా ఖర్చు చేయగా, లేటెస్ట్ జరుగుతున్న వియఫ్ఎక్స్ కోసం అదనంగా మరో 10cr ఖర్చుచేయనున్నారట. వచ్చే ఆగస్టులో సినిమా రిలీజ్ చేయబోతుండటంతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జ కి జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరీ ఇంత భారీ స్థాయిలో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించబోతుందో చూడాలి

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు