Tollywood: ఒకే రోజు నాలుగు సినిమాలు.. ఒక్కదానికీ హైప్ లేదు

టాలీవుడ్ లో వరుస సినిమాలు సమ్మర్ లో విడుదల అవుతున్న ఒక సినిమా కూడా సరైన హిట్ అవడం లేదు. అప్పుడెప్పుడో వచ్చిన విరూపాక్ష సినిమా తర్వాత టాలీవుడ్ మళ్ళీ హిట్ బొమ్మ చూడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు ఆడినా అవి డబ్బింగ్ సినిమాలు మాత్రమే. ఇక గత వారం రిలీజ్ అయిన “మేం ఫేమస్” హిట్ గీత దాటడానికి ఇంకా టైమ్ పడుతుంది. మరి ఈ వారమైనా టాలీవుడ్ కి ఒక స్ట్రెయిట్ హిట్ సినిమా పడుతుందా అంటే డౌటే అంటున్నాయి సినీ వర్గాలు.

ఈ వారం అనగా జూన్2 న నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. అయితే అందులో ఒక్కదానికి సరైన హైప్ లేకపోగా అందులో ఎవరు నటిస్తున్నారో కూడా ఆడియన్స్ కి తెలీడం లేదు. ముందుగా దగ్గుపాటి వారసుడిగా రానా తమ్ముడు అభిరాం హీరోగా “తేజ” దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అహింస” జూన్ 2 న విడుదల అవుతుంది. డైరెక్టర్ మంచి కథా బలం ఉన్న వ్యక్తే అయినా విడుదలైన ట్రైలర్ లో ఏం కొత్తదనం కనిపించడం లేదు. పైగా వెంకటేష్ అభిమానులు కూడా ఈ సినిమాపై అంత ఆసక్తిగా లేరని తెలుస్తుంది.

ఇక మరో నిర్మాత కొడుకు వారసుడు అయిన బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా “నేను స్టూడెంట్ సార్”. ఈ మూవీ పై కూడా ప్రేక్షకులు అంతగా పట్టించుకోవట్లేదు. టాక్ బాగుంటే చూద్దాం అన్నట్టు ఉన్నారు. పైగా ఈ హీరోకి ఇంతకుముందు సినిమా కూడా ఆడలేదు. మరి చూడాలి ఇతని అదృష్టం ఎలా ఉందో.

- Advertisement -

జూన్ 2న విడుదల అవుతున్న మరో రెండు చిన్న సినిమాలు పరేషాన్, చక్రవ్యూహం. “పరేషాన్” సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాగా వస్తుంటే, చక్రవ్యూహం క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా వస్తుంది. పై రెండు సినిమాలు వారసుల సినిమాలు కాబట్టి కొంచెం గట్టిగానే ప్రమోట్ చేసారు. కానీ ఈ రెండు సినిమాలకు అసలు ప్రమోషన్ల ఊసే లేకుండా పోయింది. మరి
వచ్చే మౌత్ టాక్ ని బట్టే ఈ సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక ఈ సినిమాల్లో పబ్లిక్ ఎక్కువగా పరేషాన్ సినిమా వైపునకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి టాక్ ఎలా ఉన్నా ఓ ,మోస్తరు ప్రేక్షకులు వస్తారని చెప్పవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు