Fidha : సాయి పల్లవి వెంట పడుతున్న బాలీవుడ్ హీరో..!

సహజనటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిందిఈ ముద్దుగుమ్మ.

తన సహజ నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఈమె ఇప్పటివరకు చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ భారీ స్థాయిలో అభిమానులను మూటగట్టుకుంది. సాయి పల్లవి చేసే సినిమాలు, ఎంచుకున్న పాత్రలు చూస్తే ఆమె ఎంత సహజనటి అన్నది అర్థమవుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆమెను చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి అంటే పడి చచ్చిపోతున్నాడట. అంతేకాదు ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడట.

అతను మరెవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో గుల్షన్ దేవయ్య. సాయి పల్లవి అంటే తనకు ఎంతో ఇష్టమనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సాయి పల్లవి అంటే తనకి ఒక రకమైన క్రష్ ఉందని.. ఆమె నటించిన ప్రతి సినిమాని తప్పకుండా చూస్తానని తెలిపాడు. అంతేకాదు.. ఒక్కసారైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి ఫోన్ నెంబర్ కూడా తన వద్ద ఉన్నప్పటికీ ఆమెతో మాట్లాడడానికి తనకు ధైర్యం చాలలేదని తెలిపాడు. దీంతో గుల్షన్ దేవయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు