Happy Birthday: నవశకానికి నాంది పలికిన నటశేఖరుడు!

టాలీవుడ్ కి రెండు కళ్లుగా చెప్పుకునే హీరోలు ఎవరు అంటే అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనే చెప్తారు అందరు. అలాంటి సమయంలోనే ఇండస్ట్రీ కి మూడో కన్నులాగా దూసుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు ఇండస్ట్రీ యొక్క జేమ్స్ బాండ్ గా అభిమానులు పిలుచుకుంటారు. అంతే కాదు ఇండస్ట్రీ లో ఎన్నో రకాల మార్పులకు కారణమయ్యి తెలుగు సినిమా దిశను,దశను మార్చి నవశకానికి నంది పలికారు ఈ హీరో. తన కష్టంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్బంగా filmify టీమ్ తరపున ఆయనకు నివాళులు అర్పిస్తూ నటశేఖర కృష్ణ గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం.

“కృష్ణ” అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. ఈయన 1943 సంవత్సరం మే 31న గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచే సినిమాలపై హీరో కావాలనే కోరికతో మద్రాసు వచ్చిన కృష్ణ కు అవకాశాలు అంత సులువుగా రాలేదు. ఎందరో దర్శకులని కలిసినా చిన్న వయసు ఉండడం వల్ల తొందరగా తీసుకోలేదు. ఇలాగే ఒకసారి కళా వాచస్పతి కొంగర జగ్గయ్యను అవకాశం కోసం సంప్రదించగా ఆయన నటించే సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. అలా 1962 లో జగ్గయ్య నటించిన “పదండి ముందుకు” అనే సినిమా లో చిన్న పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. ఆ తర్వాత కూడా ఐదారు చిన్న వేషాలు వేశారు. అయితే 1965 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన “తేనే మనసులు” చిత్రంలో మెయిన్ హీరోగా కృష్ణ నటించారు. ఇది తెలుగులో కలర్ లో వచ్చిన మొదటి సాంఘీక చిత్రం కావడం విశేషం.

ఆ తర్వాత కన్నె మనసులు, సాక్షి, అవేకళ్ళు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ 1966 లో విడుదలైన “గూఢచారి నెంబర్116” తో కమర్షియల్ బ్రేక్ ని పొందారు. ఈ సినిమా ద్వారా కృష్ణ జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు కేర్ఆఫ్ గా మారిపోయారు. ఇక ఆ వెంటనే పలు ఫ్యామిలీ, లవ్ చిత్రాలలో నటించిన స్టార్ హీరో హోదా మాత్రం రాలేదు. ఆ గుర్తింపు కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వచ్చిందే “మోసగాళ్లకు మోసగాడు”. 1971 లో విడుదలైన ఈ సినిమా ఇండియాలో “కౌ బాయ్” నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా. తమ్ముడు ఆదిశేషగిరిరావు ను నిర్మాతగా పెట్టి సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ పతాకం పై కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 50దేశాల్లో ప్రదర్షింపబడ్డ తొలి తెలుగు చిత్రం గా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

- Advertisement -

అప్పటి వరకు కృష్ణ స్టార్ హీరోగా మంచి సినిమాల్తో ముందుకు సాగుతున్నా ఎదో వెలితి. ఆయనలోని నటుడిని కొత్తగా చుపించాలనుకున్నారు. అటు అభిమానులకు కూడా తమ హీరోని ధీటైన పాత్రలో చూడాలని కోరుకున్నారు. ఆ సమయంలోనే “అల్లూరి సీతారామరాజు” రావడం జరిగింది. 1974లో విడుదలైన ఈ సినిమా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. తెలుగులో మొట్టమొదటి 70mm స్కోప్ సినిమా ఇదే. ఈ సినిమాలో కృష్ణ నటనకు ముగ్దులైపోయిన ప్రేక్షకులు నీరాజనం పట్టారు. 200 రోజులకు పైగా ప్రదర్షింపబడ్డ ఈ సినిమా 2కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత కృష్ణ కి బ్రేక్ రావడానికి 16 సినిమాల దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది.

కురుక్షేత్రం, ఊరికి మొనగాడు, కొత్తపేట రౌడీ, తోడు దొంగలు, అగ్ని పర్వతం వంటి చిత్రాలతో భారీ విజయాలు సాధించిన కృష్ణ ప్రయోగాలకు ఎప్పుడు పెద్దపీట వేస్తారు. వాటిలో ఆయన నటించి దర్శకత్వం వహించిన “సింహాసనం” గురించి ముందుగా చెప్పుకోవాలి. 1986 లో వచ్చిన ఈ సినిమా జానపద చిత్రంగా తొలి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ తో విడుదలైంది. ఆరోజుల్లోనే మొదటి వారం 1.50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమాలో మరెన్నో కొత్త మార్పులు తీసుకొచ్చిన కృష్ణ డేరింగ్ డాషింగ్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎన్నో సేవలనందించారు.

ఇక కృష్ణ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన భార్య ఇందిరా దేవి. వీళ్ళ సంతానమైన రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీకి వారసులుగా పరిచయమవగా మహేష్ బాబు ఇప్పుడు కృష్ణ లెగసిని కంటిన్యూ చేస్తూ సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు. ఇక కృష్ణ రెండో భార్య నటి, దర్శకురాలు విజయ నిర్మల అన్న సంగతి తెలిసిందే. అయితే తక్కువ సమయంలోనే ఘట్టమనేని కుటుంబంలో పలువురు మరణం చేత ఆయన చాలా కృంగిపోయారు. 2019 లో రెండో భార్య విజయ నిర్మల చనిపోగా, 2022 లోనే తనయుడు రమేష్ బాబు, అలాగే భార్య ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో మానసికంగా కృంగిపోయిన కృష్ణ 2022 నవంబర్ 15న హైదరాబాద్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చనిపోయారు.

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరకి సాంకేతికంగా పరిచయం చేసిన వాటిల్లో మచ్చుకు ఇవి కొన్ని..

1966 (గూఢచారి 116) ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ ఇన్ తెలుగు

1971  “మోసగాళ్లకు మోసగాడు” కౌబాయ్, స్పై టైప్ డిఫెరెంట్ తెలుగు సినిమా

1974 సినిమా స్కోప్ తెలుగు సినిమా అల్లూరి సీతారామరాజు

1986 70mm చిత్రం సింహాసనం

1995 డి.టి.యస్. సిస్టం (డిజిటల్ ట్రాక్ సౌండ్ సిస్టం) చిత్రం “తెలుగు వీర లేవరా”
మరొక్క సారి ‘నటశేఖర’ కృష్ణ గారికి సంస్మరణ నివాళులు అందచేస్తూ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నాం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు