Neha Shetty: డీజే టిల్లు బ్యూటీ ఫీస్ట్ ! మనసు విరగొట్టే మెషిన్ వి నువ్వు రాధికా అంటూ కామెంట్స్

హీరోయిన్ నేహా శెట్టి అంటే అంటే తెలియని వాళ్ళుంటారేమో గాని టిల్లు లవర్ రాధికా అంటే మాత్రం తెలియని వాళ్లుండరు. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన నేహా శెట్టి డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవడంతో సిద్దు, నేహా శెట్టిల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

డీజే టిల్లు లాంటి సక్సెస్ ఫుల్ సినిమా వేరే హీరోయిన్ కి గనక వచ్చుంటే సినిమాల మీద సినిమాలు చేస్తూ ఈపాటికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయేది. కానీ నేహా శెట్టి కెరీర్ మాత్రం అలా లేదు. డీజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ అయిన కూడా నేహా శెట్టిమాత్రం ఎప్పటిలాగే అవకాశాల కోసం ఎదురు చూడటం తప్పట్లేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కార్తికేయ హీరోగా వస్తున్న బెదురులంక అనే సినిమా తప్ప వేరే చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. అయితే ఈ సినిమా రిలీజైతేనో అవకాశాలు వస్తాయేమో అనుకుంటే, ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ అప్పుడు, ఇప్పుడంటూ మారుస్తూ వస్తున్న మూవీ టీం, సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వట్లేదు. అలాగే ఈ బ్యూటీ
ఈ మధ్యనే కిరణ్ అబ్బవరం తో రూల్స్ రంజాన్ అనే సినిమా మరియు విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా కమిట్ అయింది. కానీ ఈ సినిమాల పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది.

- Advertisement -

ఒకపక్క చేతిలో మంచి సినిమాలు లేక మరోపక్క చేసిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడో తేలిక అయోమయంలో పడిపోయింది. దాంతో నేహా శెట్టి ఖాళీగా ఉండకుండా ఇటీవలనే ఒక ఫోటోషూట్ చేసుకుంది. పింక్ కలర్ సారీ అండ్ బ్లౌస్ తో ఈ బ్యూటీ ఆమె అందాన్ని అందరి ముందు ఉంచింది. కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో డెవిల్ వియర్స్ పింక్ అనే కొటేషన్ తో సోషల్ మీడియాలో ఆమె పిక్స్ ని అప్లోడ్ చేసింది. దాంతో నేహా శెట్టి బ్యూటీ చుసిన యూత్ అంత మనసు విరగొట్టే మెషిన్ వి నువ్వు రాధికా అంటూ డీజే టిల్లు సినిమాలో ఉండే డైలాగ్ ని కామెంట్ చేస్తూ నేహా బ్యూటీని పొగుడుతున్నారు. మరీ ఈ ఫోటోషూట్ ఈ కర్ణాటక అందానికి ఏమాత్రం మేలు చేస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు