Gaami vs Bheema : గామి, భీమా ప్రీ రిలీజ్ బిజినెస్… విశ్వక్ సేన్ డామినేషన్ మామూలుగా లేదు

మహాశివరాత్రి కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతున్న సినిమాల మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. గోపీచంద్ “భీమా”, యంగ్ హీరో విశ్వక్ సేన్ “గామి” సినిమాలు మార్చ్ 8న థియేటర్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాల మధ్య జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మధ్య పోలిక పెడుతూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా బిజినెస్ విషయంలో సీనియర్ హీరో గోపీచంద్ పై విశ్వక్ సేన్ డామినేషన్ మామూలుగా లేదు. మరి ఇంతకీ ఈ రెండు సినిమాలకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? రెండు సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే…

“భీమా” ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్..
మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న కొత్త మూవీ “భీమా”. రీసెంట్ టైమ్స్ లో వరుస డిజాస్టర్లు అందుకున్న గోపీచంద్ ఈ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. డివోషనల్ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీకి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. పరశురామ క్షేత్రాన్ని కాపాడే ఓ పోలీస్ ఆఫీసర్ బ్రహ్మ రాక్షసుడిగా ఎలా మారాడు అనే అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక “భీమా” ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే… ప్రపంచవ్యాప్తంగా 11.50 కోట్లకు ఈ మూవీ అమ్ముడైనట్టు తెలుస్తోంది. నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ 3.50 కోట్లకు, ఆంధ్ర మొత్తం కలిపి 4.50 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9.50 కోట్ల వరకు “భీమా” ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో “భీమా” థియేటర్లోకి రాబోతోంది. ఇటీవల కాలంలో గోపీచంద్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా “భీమా” సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

“గామి” ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్…
ఈవారం థియేటర్లలోకి రాబోతున్న అన్ని సినిమాల్లోకెల్లా అంచనాలు ఎక్కువగా ఉన్న మూవీ “గామి”. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా “భీమా”పై “గామీ”దే డామినేషన్ నడుస్తోంది. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందిన “గామి”లో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. ఈ మూవీతో డైరెక్టర్ విద్యాధర్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. దాదాపు 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ అభినయ కీలక పాత్ర పోషించింది. యువి క్రియేషన్స్ అనుబంధ సంస్థ వి సెల్యులాయిడ్ “గామి” మూవీని తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఇక “గామి” బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే… ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 10.50 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిసి “గామి” మూవీ థియేట్రికల్ రైట్స్ 8.50 కోట్లకు అమ్ముడైనట్టు టాక్ నడుస్తోంది. ఓవర్సీస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో మరో రెండు కోట్ల వరకు “గామి” థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా కలిపి 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో “గామి” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏదైతేనేం మొత్తానికి ఒక సీనియర్ హీరో, యంగ్ హీరో మధ్య నెలకొన్న ఈ పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ బాక్స్ ఆఫీస్ బరిలో విన్నర్ గా నిలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు