Suhas: ఆట్ కమల్ హాసన్

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సుహాస్ ఒకడు. సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ఛాయ్ బిస్కెట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చేసుకుంటూ నేడు హీరో స్థాయికి ఎదిగాడు. అయితే సుహాస్ మొదటిగా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వేయి రూపాయల దగ్గర తన కెరీయర్ ను స్టార్ట్ చేశాడు. అయితే నేడు సుహాస్ తన రెమ్యూనరేషన్ ని దాదాపు మూడు కోట్ల వరకు పెంచేసాడని కథనాలు వినిపిస్తున్నాయి.

లాక్ డౌన్ టైంలో కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఆ సినిమాలో సుహాస్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అదే సినిమాతో సందీప్ రాజ్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలను చేసి మంచి హిట్స్ అందుకున్నాడు సుహాస్.

కలర్ ఫోటో సినిమా తర్వాత సుహాస్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. కేవలం కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలో దర్శకుడు చూపించిన పాయింట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

- Advertisement -

ఇక రీసెంట్ గా సుహాస్ చేసిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ ప్రజెంట్ చేసింది. అయితే థియేటర్లో కమర్షియల్ గా ఈ సినిమా మంచిగానే వసూలు చేసింది. ఇకపోతే రీసెంట్ గా ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఆహాలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. అయితే ఈ తరుణంలో వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నాడు సుహాష్.

సుహాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో తన రెమ్యూనరేషన్ ని పెంచాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే మాటను ఒక జర్నలిస్ట్ ఇంతకు ముందు అడిగినప్పుడు రెమ్యూనరేషన్ నేనేమీ పెంచలేదు. నిర్మాత ఇక్కడే ఉన్నారు కావాలంటే అడగండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సుహాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఆ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయింది.

రీసెంట్ గా మరొక జర్నలిస్ట్ సుహాస్ వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావడం వలన రెమ్యూనరేషన్ పెంచారు అని వార్తలు వస్తున్నాయి అని అడిగినప్పుడు. పెంచాలి కదా మరి నేను కూడా బతకాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నా కెరియర్ స్టార్ట్ చేశాను, నేడు పెంచకపోతే ఎలా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో భాగంగానే ₹1000 దగ్గర స్టార్ట్ చేసి చేసి మూడు కోట్ల వరకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూడు కోట్లు అనేది కరెక్ట్ ఫిగర్ కాదని, సదర్ జర్నలిస్ట్ ఆ ఫిగర్ ని కోట్ చేయటం వలన అది చెప్పానని చెప్తూ కవర్ చేశాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు