Leo: చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లు. సూపర్ ఫామ్ లోకి వచ్చిన త్రిష

త్రిష కృష్ణన్. వర్షం సినిమాతో చిరుజల్లులా తెలుగుతెరకి పరిచయమయ్యి నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో “సిరి” గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్టార్ హీరోయిన్ గ చలామణి అయిన హీరోయిన్ త్రిష. నాలుగుపదుల వయసుకు వచ్చినా అదే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఇప్పటికీ కట్టిపడేస్తుంది. లేటెస్ట్ గా పొన్నియన్ సెల్వన్ లో కుందవాయి గా మెప్పించి ఇంకా తనలో జోరు తగ్గలేదని నిరూపించింది. PS2 సినిమా ప్రమోషన్లతో ఇన్ని రోజులు బిజీ గా ఉన్న త్రిష ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబడుతుండడంతో చాలా హ్యాపీ గా ఉంది.

ఇక త్రిష తన తదుపరి ప్రాజెక్ట్స్ తో ఒక్కసారిగా చాలాబిజీ అయింది. పొన్నియిన్ సెల్వన్ విజయం కూడా ఈ ఆఫర్లు రావడానికి ఒక కారణం కావచ్చు. త్రిష ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాలు చేస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ తో రామ్ అనే సినిమా చేస్తుంది. తమిళ్ లో “ది రోడ్” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. లేటెస్ట్ గా మరో సినిమా కూడా అనౌన్స్ చేసింది. ఇక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న “లియో” లో త్రిష హీరోయిన్ గా చేస్తుంది.

లియో మూవీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష విజయ్ కాంబో లో గిల్లి, తిరుప్పాచ్చి, అత్థి, కురువి మూవీస్ వచ్చి సూపర్ హిట్లయ్యాయి. ఇప్పుడు వీరు కలిసి నటిస్తున్న 5వ సినిమాగా లియో వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే త్రిష మళ్ళీ స్టార్ హీరోస్ తో ఆఫర్లు అందుకోవడం ఖాయం. ఇటు తెలుగులో కూడా సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోల సినిమాల్లో నటించేందుకు ప్రొడ్యూసర్లు త్రిషను సంప్రదిస్తున్నారని సమాచారం. ఇది నిజమైతే త్రిషకు పాతరోజులు వచ్చినట్టే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు